స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో 3సీజన్ లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకొన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4కు వ్యాఖ్యాతగా పలువురు పేర్లు వినిపించాయి. ఎటువంటి కాంట్రవర్సీటీ లు లేకుండా బిగ్ బాస్ సీజన్ 3 ను హుందాగా, జోవియల్ గా నడిపించిన నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కు వ్యాఖ్యాత గా ఉంటారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా తనదైన స్టైల్ లో రక్తి కట్టించి ఆ షో ను విజయవంతం చేశారు. రెండవ సీజన్ కు కూడా ఎన్టీఆర్ ను సంప్రదించినా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అంగీకరించలేదు. బిగ్ బాస్ సీజన్ 2 ను హీరో నాని సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఇటువంటి రియాలిటీ షో ను నడిపించడానికి బిజీగా వుండే యంగ్ హీరోస్ కంటే వెటరన్ హీరోలే బెటర్ అనే నిర్ణయానికి స్టార్ మా యాజమాన్యం వచ్చింది. హిందీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తమిళ భాషలో తమిళ సూపర్ స్టా ర్ కమల్ హాసన్ లు వ్యాఖ్యాతలుగా బిగ్ బాస్ షో ను దిగ్విజయంగా నడిపిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























