ఫ్లాప్ డైరెక్టర్ కి అనుష్క ఛాన్స్..!

Actress Anushka, Actress Anushka Gives A Movie Chance To This Flop Director, Anushka, Anushka New Movie News, Anushka Next Film Updates, Anushka Sheety Latest Film Updates, Anushka Shetty, Heroine Anushka, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్స్ కే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు లేక వెనకపడ్డారు. దానికి కారణం వరుస ఫ్లాప్స్ వెంటాడమే కారణం. పూరీ కాస్త ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు. అలాంటిది ఇప్పుడొక డైరెక్టర్ ఒక్క సినిమాతో.. అది కూడా ప్లాప్ సినిమా తీసి ఇప్పుడు ఏకంగా అనుష్క తో చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు… సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంటగా 2014లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రా రా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక దాదాపు ఆరేళ్ళ తరువాత ఆయన అనుష్క శెట్టిని కలిసి తన స్టోరీ లైన్ తో ఇంప్రెస్ చేశారట. దీనితో అనుష్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి సినిమా చేద్దాం అని ఆఫర్ ఇచ్చారట. మరి అనుష్క ఇచ్చిన ఈ ఛాన్స్ ను ఇప్పుడైనా సరిగ్గా వాడుకుంటాడో?లేదో?చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.