పుత్రోత్సహం లో బన్నీ..!

Stylish Star Allu Arjun Shares His Joyous Moment On Twitter

ఎంత సినిమాల్లో బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడు. అంతేకాదు తన కూతురు అర్హ తో అప్పుడప్పుడు క్యూట్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పంచుకుంటాడు. అక్కడే మనం అర్ధం చేసుకోవచ్చు ఫ్యామిలీ తో పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేస్తాడని. తాజాగా బన్నీ తన ముద్దుల కొడుకు అల్లు అయాన్ ని ఉద్దేశించి ట్వీట్ చేసి … మరోసారి తన పిల్లలపై ఉన్న ప్రేమను తెలియజేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ మ్యాటరేంటంటే…అల్లు అయాన్ చదువుకునే స్కూల్ లో ‘ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ సెలెబ్రేషన్స్’ జరిగాయి. .ఇందులో భాగంగా అల్లు అయాన్ వేదికపై నిలుచుని ఉన్న ఫోటోని బన్నీ ట్విటర్ లో షేర్ చేసి… ‘అయాన్ నువ్వు ఇంత బాగా ఎదుగుతున్నందుకు గర్వంగా ఉంది. నా కుమారుడికి జీవిత విలువలు నేర్పుతున్న, వాడి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్న బోధివాలి స్కూల్ కు కృతజ్ఞతలు.. ఈ పాఠశాలలో మా అబ్బాయిని చేర్పించి తల్లి దండ్రులుగా మంచి నిర్ణయం తీసుకున్నాం….బోధివాలి స్కూల్ సిబ్బందికి నా ధన్యవాదాలు అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.


కాగా ప్రస్తుతం బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్స్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే కరోనా వల్ల కొద్దిరోజలు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.