
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 156


ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నటించాలని ఉంది..!

మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!

"ఆచార్య"మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

విశ్వస్ సేన్ కి జోడీగా కృతి శెట్టి?

జూలై నుంచి మహేష్ - పరశురామ్ చిత్రం?

మరో బయోపిక్ లో సూర్య

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?

సింగీతం దర్శకత్వంలో అనుష్క?
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం
హీరో సుధీర్ బాబు ఫిట్ నెస్ పాఠాలు
దర్శకుడు ఈవీవీ కి అల్లరి నరేష్ నివాళి ?
నాకూ ఒక లవ్ స్టోరీ ఉంది..!

బాలకృష్ణ తో చేయట్లేదు..!

#Prabhas 20 మూవీ లో పూజా హెగ్డే వింటేజ్ లుక్

ఏయన్నార్ `బుచ్చిబాబు`కి 40 ఏళ్ళు

#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా #Prabhas 20 మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ఆ ఇద్దరు హీరోయిన్స్ తో నటించాలని ఉంది..!
రౌడీ హీరో, ఆటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్, యూత్ ఐకాన్, మోస్ట్ డిజైరబుల్ మెన్ ఒక్క పేరు కాదు ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది. ఎవరో కాదు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంటరెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు…

మహేష్,రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా..!
టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సొంత ప్రొడక్షన్స్ నే పెట్టుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఏంబి ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య ఇలా చాలా మంది హీరోలు అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు.

"ఆచార్య"మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా ఎంపిక అయినా అనివార్య కారణాల వలన ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కాజల్, అనుష్క పేర్లు వినిపించినా ఫైనల్ గా కాజల్ ఎంపిక అయ్యారు.

'ఆర్ఆర్ఆర్' నుండి అలియా తప్పుకోలేదు.. అవన్నీ అబద్ధం
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ గురించి అటు రాంచరణ్ అభిమానులు, తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు తప్పని తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ నుండి అలియా తప్పుకుందని వస్తున్న వార్తల్లోవాస్తవం లేదనీ... డేట్స్ సమస్య వచ్చినప్పటికీ సర్దుబాటు చేసిందని.. ఈ సినిమా కోసం మే నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పూణే…

విశ్వస్ సేన్ కి జోడీగా కృతి శెట్టి?
రీసెంట్ గా రిలీజైన `హిట్` చిత్రంతో తన ఖాతాలో ఓ హిట్ మూవీని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ `పాగల్` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతోందని సమాచారం.

జూలై నుంచి మహేష్ - పరశురామ్ చిత్రం?
ఈ సంక్రాంతికి విడుదలైన `సరిలేరు నీకెవ్వరు`తో కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. కథానాయకుడిగా తనకది 26వ చిత్రం. కాగా, తన 27వ సినిమాని `గీత గోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడట మహేష్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయని సమాచారం.

మరో బయోపిక్ లో సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మరో బయోపిక్ చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాగా... తాజాగా సూర్య మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, అది ఎవరి బయోపిక్ నో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ పలు రీమేక్ చిత్రాల్లో నటించడమే కాకుండా... ఘనవిజయాలను సైతం అందుకున్నారు. తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలచిన `మంగమ్మ గారి మనవడు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహ`... ఇలా పలు సక్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ నటించిన వైనం బాలయ్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్న నటసింహ... త్వరలో ఓ రీమేక్ ఫిల్మ్ లో నటించే అవకాశముందట. అది కూడా.. ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ కోసం.

సింగీతం దర్శకత్వంలో అనుష్క?
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ గాయని బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ఆయన ఓ బయోపిక్ రూపొందించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో నాగరత్నమ్మ పాత్రలో లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్. త్వరలోనే ఈ బయోపిక్, స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

'జనతా కర్ఫ్యూ' వేళ మీ ఇంట కొత్త సినిమాల సందడి
ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎప్పుడు థియేటర్ కు వెళదామా... ఎప్పుడు సినిమా చూద్దామా అని వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలిజీ పుణ్యమా అని ఓటీటీ ఫామ్స్ వాడకం ఎక్కువైంది. సినిమా లవర్స్ అయితే థియేటర్స్ కు వెళ్లి చూస్తున్నారు. కాస్త సినిమాలంటే ఇంట్రస్ట్ తక్కువగా ఉన్నవాళ్లు అయితే కాస్త హిట్ అయిన సినిమాలైతే థియేటర్ లో చూస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ ఒక పదిరోజుల్లో ఎలాగూ ఆన్ లైన్ లోకి వచేస్తాయి కదా... ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చని ఫిక్స్ అవుతున్నారు. ఆన్ లైన్ సైట్స్ అలా రాజ్యమేలుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, హిట్ సినిమా? ప్లాప్ సినిమా? అని లేదు. రిలీజ్ అయిన కొద్దిరోజులకు…
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జ్ఞానేశ్వరి రామన్ అనారోగ్యంతో ఈరోజు(మర్చి 21) తెల్లవారుజూమున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కాగా, తన తల్లి మరణంతో రత్నవేలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్నవేలుకు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలియచేశారు.
హీరో సుధీర్ బాబు ఫిట్ నెస్ పాఠాలు
కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అవుతున్న విషయం తెలిసిందే. మాల్స్ , థియేటర్స్, జిమ్ లు బంద్ అయ్యాయి. మూవీషూటింగ్స్ కూడా రద్దు అయ్యాయి. ఫిట్ నెస్ కై హీరో సుధీర్ బాబు ఇంటిలోనే వర్క్ అవుట్స్ చేసుకొనే వీడియోస్ రూపొందించి ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు.
దర్శకుడు ఈవీవీ కి అల్లరి నరేష్ నివాళి ?
కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ స్పెషలిస్ట్ దర్శకుడు ఈవీవీ తనయుడు నరేష్ "అల్లరి" మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి , ఆ మూవీ టైటిల్ నే ఇంటిపేరు గా మార్చుకున్నారు. కితకితలు, అత్తిలి సత్తిబాబు, సీమ శాస్త్రి , బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, అహ నా పెళ్ళంట, సుడిగాడు , సిల్లీ ఫెలోస్ వంటి మూవీస్ లో అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.
నాకూ ఒక లవ్ స్టోరీ ఉంది..!
అనుష్క సినిమాల సంగతేమో కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఎప్పుడో ఏదో ఒక రూమర్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి ఈ విషయాల్లో అనుష్క కు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి ఉంటది. అనుష్కకు పలానా వ్యక్తితో పెళ్లి.. అనుష్క పలానా వ్యక్తితో ప్రేమలో ఉంది.. ఈ వార్తలను గతకొన్ని సంవత్సరాలనుండి వింటూనే ఉన్నాం. ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్.. ఆఖరికి దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మొదట సీరియస్ తీసుకున్నా.. ఇలాంటి రూమర్లను తర్వాత సెలబ్రిటీస్ లైట్ తీసుకుంటారనుకోండి అది వేరే విషయం. అనుష్క కూడా ఈ విషయాలను ఎప్పుడో లైట్…

బాలకృష్ణ తో చేయట్లేదు..!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది 'వెంకీమామ' సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ 'డిస్కో రాజా' సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.
'కరోనా' ను పక్కనపెట్టి సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడుగా..!
కరోనాకు భయపడి ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ లు కూడా ఆపేసారు. సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తనపాటికి తాను షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంత డేరింగ్ ఉన్న డైరెక్టర్ ఎవరబ్బా అనుకుంటున్నారా..? ఎవరో కాదు మన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.
కొణిదెల ప్రొడక్షన్స్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!
చిరు-కొరటాల దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు ఒక నిర్మాతగా రామ్ చరణ్ కూడా ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చరణ్ పై గతరెండు రోజులుగా ఒక వార్త నెట్టింట హల్ చల్ చేసింది. అదేంటంటే... ఆయన ఈ చిత్రం ప్రొడక్షన్ కు సింగిల్ పైసా కూడా ఖర్చుపెట్టడంలేదని.. మరో నిర్మాత నిరంజన్ రెడ్డి మాత్రమే చూసుకుంటున్నాడని... అంతేకాక తను ఆచార్య లో చేస్తున్నందుకు రెమ్యునేషన్ తీసుకోవటమే కాకుండా, నిర్మాతగా సగం వాటా సైతం తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

#Prabhas 20 మూవీ లో పూజా హెగ్డే వింటేజ్ లుక్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం అంతా ఆందోళన చెందుతున్న సమయంలో జార్జియా లో#Prabhas 20 మూవీషూటింగ్ జరుపుకుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో ఒక ఛేజ్ సీన్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు.

ఏయన్నార్ `బుచ్చిబాబు`కి 40 ఏళ్ళు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావుది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. వాటిలో `బుచ్చిబాబు` ఒకటి. అత్తింటిని చక్కదిద్దిన ఓ అల్లుడి కథతో రూపొందిన ఈ సినిమాలో ఏయన్నార్ కి జోడీగా అందాల తార జయప్రద నటించారు. సూర్యకాంతం, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, చలం, రాజబాబు, రమాప్రభ, గీత, మాస్టర్ హరీష్, బేబి తులసి తదితరులు ముఖ్యభూమికలు పోషించిన ఈ చిత్రంలో దాసరి, మురళీ మోహన్, మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించారు.