టాలీవుడ్ హీరోలు ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతలుగా మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సొంత ప్రొడక్షన్స్ నే పెట్టుకోవడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు జిఏంబి ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్, కళ్యాణ్ రామ్, నాగశౌర్య ఇలా చాలా మంది హీరోలు అటు సినిమాల్లో నటిస్తూ.. ఇటు నిర్మాణ రంగంలోనూ దూసుకుపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీళ్ల బాటలోనే నడవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్‌హెచ్‌కే(నందమూరి హరికృష్ణ) ఆర్ట్స్ బ్యానర్ పేరిట సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాకే ఎన్‌హెచ్‌కే నిర్మాణ సంస్థను భాగస్వామిని చేయాలని భావిస్తున్నాడట. ఈ బ్యానర్లో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించాలని భావిస్తున్నారట. ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు ఒకరు చూసుకుంటారని సమాచారం. నటుడిగా గొప్ప విజయాలను అందుకున్న ఎన్టీఆర్.. నిర్మాతగా ఎంతవరకూ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: