కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 157

సినిమా వార్తలు

జనతా కర్ఫ్యూ పై సినీ ప్రముఖుల స్పందన

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజల ధన , ప్రాణ నష్టాలకు కరోనా వైరస్ హేతువుగా మారింది. ఇటువంటి పరిస్థితులలో దేశంలోని ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ నియంత్రణ కై 22వ తేదీ (ఆదివారం ) జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా స్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనతా కర్ఫ్యూ పై తమ స్పందన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

`ఆర్య‌` విడుద‌ల‌ తేదికి `ఉప్పెన‌`?

మెగా కాంపౌండ్ నుంచి మ‌రో టాలెంటెడ్ హీరో తెరంగేట్రం చేయ‌నున్నాడు. అత‌డే.. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్. `ఉప్పెన‌` పేరుతో రూపొందిన ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు బుచ్చి బాబు సానా తెర‌కెక్కించాడు. కాగా, తొలుత ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌జినీకాంత్ ని డైరెక్ట్ చేయ‌నున్న రాఘ‌వ లారెన్స్?

వ‌రుస చిత్రాల‌తో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ జోరు మీదున్నారు. గ‌త ఏడాది సంక్రాంతికి `పేట‌`తోనూ.. ఈ సంవ‌త్స‌రం సంక్రాంతికి `ద‌ర్బార్`తోనూ ప‌ల‌క‌రించిన ర‌జినీ.. ఈ ద‌స‌రాకి `అణ్ణాత్త‌` (తెలుగు టైటిల్ నిర్ణ‌యించాల్సి ఉంది)తో సంద‌డి చేయ‌నున్నారు. ఆపై త‌న మిత్రుడు, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో త‌న 169వ సినిమా చేయ‌నున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

`అల్లుడు అదుర్స్`లో నిధి అగ‌ర్వాల్ ప్ర‌త్యేక గీతం?

గ‌త ఏడాది `రాక్ష‌సుడు`తో ప‌ల‌క‌రించిన‌ యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్... ఈ వేస‌విలో `అల్లుడు అదుర్స్` అంటూ సంద‌డి చేయ‌నున్నాడు. `కందిరీగ‌` ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో సాయిశ్రీ‌నివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ నాయిక‌లుగా న‌టిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ఆచార్య‌`లో రష్మికా మంద‌న్న‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తున్న చిత్రం `ఆచార్య‌`. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 30 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్వీయ గృహ నిర్బంధం లో ప్రభాస్

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ కాగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినిమా షూటింగుల నిలిపివేత పొడిగింపు

రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. ఎవరికి వాళ్లు స్వతహాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బయట తిరగడం.. తినడం మానేశారు. ఇక థియేటర్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్, ఆఫీస్ లు అన్నీ మూత పడ్డాయి. ఇక సినీ పరిశ్రమ కూడా ఈ వైరస్ కు భయపడిపోయి ఎక్కడిక్కకడ షూటింగ్ లను మధ్యలోనే ఆపేసి ఇళ్లకు చేరుకున్నారు. రిలీజ్ సినిమాలను వాయిదా వేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ లో సూర్య కార్తీ..!

తమిళ్ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి నటిస్తాడు కాదు కాదు జీవిస్తాడు. ఇక తమ్ముడు కార్తీ కూడా అంతే.. అన్నకు తగ్గ తమ్ముడే. మొదటి నుండీ కార్తీ కథలు కాస్త విభిన్నంగానే ఉంటాయి. ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు. అలాంటి వీరిద్దరూ కాలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. కళ్ళకు పండగే కదా. అయితే ఇప్పుడు ఇదే వార్త జోరుగా వినిపిస్తుంది. వెళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్టు తమిళనాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మలయాళం సినిమా ఏంటి.. ఆ కథేంటి ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ ఎస్ కు మరో ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల వైకుంఠపురములో .. " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ విజయానికి థమన్ ఎస్ సంగీతం తోడ్పడింది. థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ మరోసారి థమన్ కు సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ పెళ్లి..!

అమలా పాల్, ముంబై సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌ గతకొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఇప్పటికే పలు వార్తల్లో చూశాం. ఇక ఈ వార్తలు కూడా నిజమే అని ఒప్పేసుకుంది కేరళ బ్యూటీ అమలా పాల్. గతంలోనూ భవ్నీందర్‌ ఆడై సినిమా ప్రమోషన్ల సమయంలో.. నా ప్రేయసిని చూసి గర్వపడుతున్నాను. మున్ముందు కూడా ఇలాగే నీ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కొన్నిసార్లు వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నాడు. దీనితో అప్పుడే ఫిక్స్ అయిపోయారు అమలా పాల్ బాయ్ ఫ్రెండ్ ఇతనే అని. ఇక అమలా పాల్ కూడా ఒప్పుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Interesting Update About Nani V Movie
సినిమా వార్తలు

నాని 'V' - ముగిసిన చోట నుండే ప్రారంభం

నిజానికి ఒక సినిమా సూపర్ హిట్ అయితే కానీ దాన్ని సీక్వెల్ ను తీయడానికి ఆలోచిస్తారు దర్శనిర్మాతలు. సీక్వెల్ కు సరిపడా గట్టి కథ దొరికిందా.. వెంటనే సీక్వెల్ ప్లాన్ చేసేస్తారు. అయితే ఇక్క ఒక సినిమాపై మాత్రం ఇంకా రిలీజ్ కాకముందే సీక్వెల్ ఉంటుందేమో అన్న వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'వి'. ఇప్పటికే ఈ సినిమా మంచి బజ్ ను సొంతం చేసుకుంది. నాని నెగిటివ్ షేడ్ లో నటించడం.. పవర్ ఫుల్ ఆఫీసర్ గా సుధీర్ బాబు...వాటికి తోడు మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దళపతి విజయ్ "తుపాకి " మూవీ సీక్వెల్ ?

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ , దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందిన "తుపాకి ", "కత్తి ", "సర్కార్" మూవీస్ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ గా నిలిచాయి. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా యోగాసనాలు

కరోనా వైరస్ ప్రజల దైనందిక జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రజల ధన, ప్రాణ నష్టాలకు గురిచేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, సామజిక దూరం పాటిస్తూ ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు. ఇప్పటికే మాల్స్, థియేటర్స్, షూటింగ్స్ రద్దు చేశారు . ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా స్వీయ గృహ నిర్బంధం లో ఉంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Isha Koppikar To Act In RGV Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Isha Koppikar,Actress Isha Koppikar,Heroine Isha Koppikar,Isha Koppikar Latest News,Isha Koppikar New Movie News,Isha Kopp
సినిమా వార్తలు

వర్మ వెబ్ సిరీస్ లో ఇషా..!

రామ్ గోపాల్ వర్మ మేధావి అంటుంది ఒక సీనియర్ హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు ఇషా కొప్పికర్. ఈ టైం లో ఆమె వర్మ ను పొగడటానికి కారణం ఏంటబ్బా అంటే.. ప్రస్తుతం ఆమె వర్మ తీస్తున్న వెబ్ సిరీస్ లో నటిస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం సినిమా తెస్తాడో.. ఎప్పుడు వెబ్ సిరీస్ అంటదో చెప్పడం కష్టం. ఒక పక్క సినిమాలు తెస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాగాజా మరో వెబ్ సిరీస్ తో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి కంప్లైంట్

కమర్షియల్ సక్సెస్ మూవీ "అందాలరాక్షసి" తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి "భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తన పై అసభ్య వ్యాఖ్యలు, వివాహం చేసుకున్నానని అసత్య ప్రచారం చేస్తున్న ఇసిఐఎల్ ప్రాంతానికి చెందిన సునిశిత్ అనే వ్యక్తి పై సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి కంప్లైంట్ చేశారు.

Team TFNవాట్సాప్
Superb Craze For Ninnu Kori Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ninnu Kori,Ninnu Kori Movie,Ninnu Kori Telugu Movie Latest News,Ninnu Kori Movie Updates,Ninnu Kori Remake,Ninnu Kori Movie Re
సినిమా వార్తలు

'నిన్నుకోరి' రీమేక్ కు సూపర్ క్రేజ్..!

అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒకప్పుడు మనం పక్క సినిమాలను తెచ్చుకొని ఇక్కడ రీమేక్ చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు మన సినిమాలకు క్రేజ్ పెరిగింది. మన సినిమాలను రీమేక్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలను రీమేక్ చేయగా ఇప్పుడు మరో సినిమా రీమేక్ కోసం ఎగపడుతున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. నాని 'నిన్నుకోరి' సినిమా.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

క‌న్న‌డ సీమ‌కు `అసుర‌న్`

న‌టుడిగా కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం `అసుర‌న్`(2019). యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ త‌మిళ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. అలాగే ప‌లు పుర‌స్కారాల‌ను కూడా సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా.. తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతోంది. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`మాస్ట‌ర్`లో రెండు విభిన్న పాత్ర‌ల్లో విజ‌య్

గ‌త ఏడాది దీపావ‌ళికి విడుద‌లైన `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ విజ‌య్ కాంబినేష‌న్ లో రూపొందిస్తున్నాడు. `మాస్ట‌ర్` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విల‌న్ గా భూమిక

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టీమ‌ణుల్లో భూమికా చావ్లా ఒక‌రు. `స్టూడెంట్` నుంచి `లేడీ బాస్` వ‌ర‌కు.. ఇలా ప‌లు వైవిధ్య‌భ‌రిత పాత్ర‌ల్లో త‌న‌దైన అభిన‌యంతో అల‌రించిందీ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య `మిస్స‌మ్మ‌`చిత్రంలో నెగ‌టివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించిన ఈ `ఖుషి` స్టార్.. త్వ‌ర‌లో పూర్తి స్థాయి ప్ర‌తినాయ‌కురాలిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. అది కూడా.. ఓ అగ్ర క‌థానాయ‌కుడి చిత్రంలో. ఆ స్టార్ ఎవ‌రో, ఆ సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాక‌పోయినా.. భూమిక పోషిస్తున్న విల‌న్ రోల్ మాత్రం సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లాయ‌ర్ పాత్ర‌లో సూర్య‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న త‌మిళ‌ క‌థానాయ‌కుల్లో సూర్య ఒక‌రు. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ స్టార్.. త్వ‌ర‌లో లాయ‌ర్ అవ‌తార‌మెత్త‌నున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్