లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ గాయని బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ఆయన ఓ బయోపిక్ రూపొందించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో నాగరత్నమ్మ పాత్రలో లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్. త్వరలోనే ఈ బయోపిక్, స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బెంగళూరుకి చెందిన నాగరత్నమ్మ.. దేవదాసిగా పుట్టి సంగీత కళాకారిణిగా ఎదిగి జీవిత చరమాంకంలో యోగినిగా మారింది. అంతేకాదు.. తన సంపదనంతా కళలకు, కళాకారులకు ధారపోసింది. మరి.. తన రాష్ట్రానికి చెందిన నాగరత్నమ్మ బయోపిక్ లో స్వీటీ నటిస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































