‘ఆర్ఆర్ఆర్’ నుండి అలియా తప్పుకోలేదు.. అవన్నీ అబద్ధం

Bollywood Heroine Alia Bhatt Is Not Out Of Rajamouli RRR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Alia Bhatt,Alia Bhatt Latest News,Alia Bhatt New Movie News,Alia Bhatt Upcoming Film News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Shooting Updates,RRR Telugu Movie Shooting Latest News,Jr NTR,Ram Charan

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్స్ గురించి అటు రాంచరణ్ అభిమానులు, తారక్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలు తప్పని తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ నుండి అలియా తప్పుకుందని వస్తున్న వార్తల్లోవాస్తవం లేదనీ… డేట్స్ సమస్య వచ్చినప్పటికీ సర్దుబాటు చేసిందని.. ఈ సినిమా కోసం మే నుండి ఆమె షూటింగ్ లో పాల్గొనబోతుందని ఆర్ఆర్ఆర్ టీమ్ తెలిపింది. కరోనా వైరస్ కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే 70శాతం షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. సెప్టెంబర్ కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు. 2021 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =