అనుష్క సినిమాల సంగతేమో కానీ వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఎప్పుడో ఏదో ఒక రూమర్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి ఈ విషయాల్లో అనుష్క కు ఎప్పుడూ ఏదో ఒక తలనొప్పి ఉంటది. అనుష్కకు పలానా వ్యక్తితో పెళ్లి.. అనుష్క పలానా వ్యక్తితో ప్రేమలో ఉంది.. ఈ వార్తలను గతకొన్ని సంవత్సరాలనుండి వింటూనే ఉన్నాం. ప్రభాస్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఓ ప్రముఖ క్రికెటర్‌తో రిలేషన్‌షిప్.. ఆఖరికి దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనుందన్న ఊహాగానాలు వినిపించాయి. మొదట సీరియస్ తీసుకున్నా.. ఇలాంటి రూమర్లను తర్వాత సెలబ్రిటీస్ లైట్ తీసుకుంటారనుకోండి అది వేరే విషయం. అనుష్క కూడా ఈ విషయాలను ఎప్పుడో లైట్ తీసుకుంది. రీసెంట్ గా తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది. తమ తల్లితండ్రులు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అని చెప్పేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మరోసారి తాజాగా ఈ రూమర్లపై స్పందించి అసహనం వ్యక్తం చేసింది స్వీటీ. తనకంటూ సొంత జీవితం ఉందని, అందులోకి కొందరు వేలుపెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదన్నారు. తన ప్రేమ,పెళ్లి గురించి వదంతులు ప్రచారం చేసేవారందరికీ చెప్పేదేమిటంటే తానూ ఒక్కప్పుడు ప్రేమలో పడినట్లు తెలిపారు. నేను ఒకప్పుడు ప్రేమలో ఉన్నాను. అది ఛాలా స్వీట్ లవ్. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. …కొన్ని కారణాల వల్ల విడిపోక తప్పులేదని అలాగే తను ప్రేమించిన వ్యక్తి గురించి చెప్పడం ఇష్టం లేదని చెప్పింది. అలాగే ప్రభాస్ తాను మంచి స్నేహితులమని అన్నారు. ఇక ప్రభాస్ మాత్రం తనకు ఎల్లపుడు ఒక మంచి స్నేహితుడే అని చెప్పేసింది. మరి ఒకటీ రెండూ అంటే ఎవరైనా లైట్ తీసుకుంటారు.. అలాకాకుండా అదే పనిగా తమ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. ఇప్పటికైనా అనుష్క ప్రేమ,పెళ్లి పై రూమర్లు రాకుండా ఉంటాయేమో చూద్దాం..
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా.. అందులోనూ మూగ పాత్రలో చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: