ఏయ‌న్నార్ `బుచ్చిబాబు`కి 40 ఏళ్ళు

ANR Buchi Babu Completes 40 Years

మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావుది ఎవ‌ర్ గ్రీన్ కాంబినేష‌న్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు రూపొందాయి. వాటిలో `బుచ్చిబాబు` ఒక‌టి. అత్తింటిని చ‌క్క‌దిద్దిన ఓ అల్లుడి క‌థ‌తో రూపొందిన ఈ సినిమాలో ఏయన్నార్ కి జోడీగా అందాల తార జ‌య‌ప్ర‌ద న‌టించారు. సూర్య‌కాంతం, గుమ్మ‌డి, ప్ర‌భాక‌ర రెడ్డి, చ‌లం, రాజ‌బాబు, ర‌మాప్ర‌భ‌, గీత, మాస్ట‌ర్ హ‌రీష్, బేబి తుల‌సి త‌దిత‌రులు ముఖ్య‌భూమిక‌లు పోషించిన ఈ చిత్రంలో దాస‌రి, ముర‌ళీ మోహ‌న్, మోహ‌న్ బాబు ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వ‌ర దిగ్గ‌జం చ‌క్ర‌వ‌ర్తి సంగీత సార‌థ్యంలో రూపొందిన గీతాల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా.. `సిత్త‌రాల తోట‌లో` పాట ఇప్ప‌టికీ అల‌రిస్తూనే ఉంటుంది. ఎ.ఎ. కంబైన్స్ ప‌తాకంపై వెంక‌ట్ అక్కినేని, నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 1980 మార్చి 21న విడుద‌లైన `బుచ్చిబాబు`.. నేటితో 40 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 8 =