రౌడీ హీరో, ఆటిట్యూడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్, యూత్ ఐకాన్, మోస్ట్ డిజైరబుల్ మెన్ ఒక్క పేరు కాదు ఇలా చాలా పేర్లే ఉన్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో అర్దమయ్యేవుంటది. ఎవరో కాదు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరి కంట్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంటరెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు హీరోయిన్స్ లో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో విజయ్ దేవరకొండ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో విజయ్ పేరు మరోసారి మార్మోగిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. మీకు బాలీవుడ్ లో ఎవరితో నటించాలని ఉంది అని అడుగగా? దానికి విజయ్.. ఒక్కరి పేరు చెప్పడం కష్టం కానీ.. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే మాత్రం… జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు చెపుతానని చెప్పాడు. మరి జాన్వీ కపూర్, కియారా అద్వానీ ఇద్దరికీ విజయ్ అంటే క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందో చూద్దాం..
కాగా ప్రస్తుతం విజయ్ పూరీ కాంబినేషన్ లో ఫైటర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. నిజానికి ఈ సినిమాలో మొదట జాన్వీ కపూర్ నే అనుకున్నారు. కానీ తనకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అనన్య పాండే వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: