‘జనతా కర్ఫ్యూ’ వేళ మీ ఇంట కొత్త సినిమాల సందడి

New Movies Gets Released Online Due To Coronavirus Effect

ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే చాలు ఎప్పుడు థియేటర్ కు వెళదామా… ఎప్పుడు సినిమా చూద్దామా అని వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలిజీ పుణ్యమా అని ఓటీటీ ఫామ్స్ వాడకం ఎక్కువైంది. సినిమా లవర్స్ అయితే థియేటర్స్ కు వెళ్లి చూస్తున్నారు. కాస్త సినిమాలంటే ఇంట్రస్ట్ తక్కువగా ఉన్నవాళ్లు అయితే కాస్త హిట్ అయిన సినిమాలైతే థియేటర్ లో చూస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ ఒక పదిరోజుల్లో ఎలాగూ ఆన్ లైన్ లోకి వచేస్తాయి కదా… ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూడొచ్చని ఫిక్స్ అవుతున్నారు. ఆన్ లైన్ సైట్స్ అలా రాజ్యమేలుతున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, హిట్ సినిమా? ప్లాప్ సినిమా? అని లేదు. రిలీజ్ అయిన కొద్దిరోజులకు ఆన్ లైన్ సైట్ లలో దర్శనమివ్వాల్సిందే. ఇక ఇప్పుడు కరోనా వల్ల ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి…ఇంకా థియేటర్స్ ఎలాగూ బంద్. థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో డిజిట‌ల్ ఓటీటీల‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమెజాన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌కు మ‌రింత డిమాండ్ పెరిగిపోయింది. సో ఇంట్లో ఎలాగూ బోర్ కొడుతుంది కదా… ఇంకెందుకు లేట్ పలు సినిమాలు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇటీవల రిలీజ్ అయిన కొత్తసినిమాలు ఏ ఆన్ లైన్ సైట్ అందుబాటులో ఉందో ఒకసారి చూద్దాం..

ఓ పిట్టకథ

చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 6న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు లేట్ కింద ఈ సినిమా లింక్ ఇవ్వబడింది.. అమెజాన్ లో ఈ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయండి.

https://bit.ly/33Csq9y

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’. ఈ సినిమా రిలీజ్ కు ముందు పలు వివాదాల్లో ఇరుక్కుంది. అసలు విడుదలవుతుందా లేదా అనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కూడా ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.

https://bit.ly/3dkRO8f

ప్రతిరోజూ పండగే

సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. గత ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. వరుస ఫ్లాప్స్ తో ఉన్న సాయి తేజ్… గత ఏడాది మొదట ‘చిత్రలహరి’తో డీసెంట్ హిట్ అందుకొని ఫామ్‌లోకి వచ్చారు. ఆ సినిమా తరవాత ‘ప్రతిరోజూ పండగే’ తో మరో హిట్ అందుకున్నాడు. ఇక సినిమా ‘హాట్ స్టార్’ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/33B2dIu

ఖైదీ

కోలీవుడ్‌ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఖైదీ. మా నగరం ఫేం లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పదేళ్ల తరువాత విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని తొలిసారిగా చూసేందుకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ తెలుగు భాషల్లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఇక ఈ సినిమా ‘అహ’ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/2xicrkU

ప్రెషర్ కుక్కర్

అమెరికా వెళ్ళమని తమ పిల్లలను కొంతమంది తల్లితండ్రులు ఎలా టార్చర్ పెడతారో.. అదే కాన్సెప్ట్ ను తీసుకొని తీసిన సినిమా ‘ప్రెషర్ కుక్కర్’. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్‌ దర్శకత్వంలో సుశీల్‌ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికా మోజులో పడి యువత ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొంటున్నారు?పిల్లల్ని విదేశాలకు పంపించాలని తల్లిదండ్రులు పడే తాపత్రయం ఏమిటి? చదువు పేరుతో విదేశాలకు వెళ్లిన వారు అక్కడే స్థిరపడి కన్నవాళ్లకు ఎలాంటి వేదనను మిగుల్చుతున్నారనే పాయింట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ‘అహ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/2UalFsO

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు మాత్రమే చెప్తా

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ‘పెళ్లి చూపులు’ మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేసిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాను నూతన దర్శకుడు సమీర్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ‘హాట్ స్టార్’ లో అందుబాటులో ఉంది

https://bit.ly/2J4e2O7

ఎంత మంచివాడవురా

నందమూరి కళ్యాణ్‌రామ్‌-మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. ‘శతమానం భవతి’తో నేషనల్‌ అవార్డు అందుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేదు. ఇక ఈ సినిమా ‘హాట్ స్టార్’ లో అందుబాటులో ఉంది. ఇంకెందుకు లేట్ చూసి ఎంజాయ్ చేయండి.

https://bit.ly/2QAv0aT

జాను

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘జాను’. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాకు ఇది రీమేక్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన వారు శర్వా, సమంతలపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/2WDVPz3

తూటా

గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఎన్నై నోక్కి పాయిమ్ తోట్ట’. తెలుగులో ఈ సినిమాను ‘తూటా’ టైటిల్ తో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/2wfowrf

చూసీ చూడంగానే

‘పెళ్ళిచూపులు’, ‘మెంట‌ల్ మ‌దిలో’ వంటి చిత్రాల‌ను నిర్మించి స‌క్సెస్‌ఫుల్ నిర్మాత‌గా జాతీయ అవార్డ్‌, ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్న రాజ్ కందుకూరి నిర్మాత‌గా ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆయ‌న త‌న‌యుడు శివ కందుకూరిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం ‘చూసీ చూడంగానే’.. శేష సింధు ద‌ర్శకురాలు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా జనవరి 31న విడుదలైంది ఈ సినిమా. ఇక ఈ సినిమా ‘అహ’ లో అందుబాటులో ఉంది.

https://bit.ly/2WxF74j

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here