బాలకృష్ణ తో చేయట్లేదు..!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది. మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అంజలిని సెలెక్ట్ చేయగా.. మరో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన పాయల్… తాను బాలకృష్ణ సినిమాలో నటించట్లేదని.. బాలకృష్ణ సినిమాలో తాను నటిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఇక ప్రస్తుతం పాయల్ ‘5డబ్ల్యూ ఎస్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫిసర్ పాత్రలో కనిపించబోతుంది.ఇంకా జయంత్ పరాన్జీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా ‘నరేంద్ర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాలో ఇండియన్‌ ఫస్ట్‌ ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది. మరి చూద్దాం ఈ అమ్మడికి ఈ సినిమాల ద్వారా అయినా మంచి బ్రేక్ వస్తుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.