
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 155


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డ్రీమ్

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?

పేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ చేయూత

'ఉప్పెన' లా దూసుకువస్తున్న కృతి శెట్టి..!

కమల్ హాసన్ కు జోడీగా అనుష్క ?

నిర్మాతగా రష్మిక

సంక్రాంతికి వాయిదా పడ్డ అజిత్ చిత్రం?

నందమూరి బాబాయ్ - అబ్బాయ్ ల చిత్రాల్లో శ్రియ?

క్రిష్ చిత్రంలో పవన్ ద్విపాత్రాభినయం?

మరోసారి రవితేజకి జోడీగా త్రిష?

కరోనా కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!

"ఉప్పెన" మూవీ రిలీజ్ డేట్

ఆ లిస్ట్ లో మణిరత్నం కొడుకు కూడా..!

తమన్నా షూటింగ్ అనుభవాలు

బాలీవుడ్ కి వెళ్తున్న భీష్మ..!

రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారే.. సినిమా కార్మికులకు 50 లక్షల విరాళం
కరోనా.. కరోనా.. కరోనా ఎక్కడ చూసినా ఈ మాట తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఎవరు మాట్లాడుకున్నా ఇఇ విషయం గురించే.. టీవీ లు పెట్టినా ఇదే న్యూస్.. ఇక ప్రజలైతే ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైతే లాక్ డౌన్ చేసేసారు. ఏదో కనీస అవసరాలు తీర్చుకోడానికి తప్పితే ప్రజలను బయటకు రానివ్వట్లేదు ప్రభుత్వ అధికారులు. స్కూల్స్, ఆఫీస్ లు, థియేటర్స్, మాల్స్ ఇలా అన్నీ మూతపడ్డాయి. షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సెలెబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉండి మంచిగా ఫ్యామిలీస్ తో గడుపుతున్నారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డ్రీమ్
సూపర్ హిట్ మూవీ "పటాస్" తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్" , "F 2", "సరిలేరు నీకెవ్వరు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అనిల్ బ్లాక్ బస్టర్ "F 2" మూవీ సీక్వెల్ "F 3 " మూవీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.

హీరో శర్వానంద్ తమిళ మూవీ ?
"రన్ రాజా రన్ ", మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు", "శతమానం భవతి", "మహానుభావుడు" వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన హీరో శర్వానంద్ కథానాయకుడిగా, చేరన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందిన "రాజాధిరాజా" మూవీ 2015 సంవత్సరంలో తమిళ భాషలో రిలీజ్ అయ్యింది. ఆ మూవీ తరువాత తెలుగు మూవీస్ తో బిజీగా ఉన్న శర్వానంద్ తమిళ మూవీస్ లో నటించలేదు. శర్వానంద్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

పేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ చేయూత
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మూవీ షూటింగ్స్ రద్దు అయిన విషయం తెలిసిందే. షూటింగ్స్ రద్దు అయిన కారణంగా పనిలేక పలువురు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోజూ పనిచేస్తే కానీ ఇల్లు గడవనిపేద సినీ కళాకారులు, కార్మికులకు రాజశేఖర్ తన వంతు సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

'ఉప్పెన' లా దూసుకువస్తున్న కృతి శెట్టి..!
టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొంతమంది మాత్రమే నోటెడ్ అవుతారు. కొంతమందికి మాత్రమే లక్ కలిసొస్తుంది. ఇక ఇక్కడ ఒక అప్ కమింగ్ హీరోయిన్ తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది. అందుకే ఇంకా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా దూసుకువస్తుంది ఈ భామ.

కమల్ హాసన్ కు జోడీగా అనుష్క ?
బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు , ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ ,అనుష్క ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

నిర్మాతగా రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం", "సరిలేరు నీకెవ్వరు" , "భీష్మ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో అగ్ర తారగా దూసుకుపోతున్నారు. రష్మిక ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కొత్త దర్శకులకు అవకాశం కల్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతికి వాయిదా పడ్డ అజిత్ చిత్రం?
`నేర్ కొండ పార్ వై` (బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) వంటి విజయవంతమైన చిత్రం తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, `ఖాకి` దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `వలిమై`. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అజిత్ కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.

నాగచైతన్యతో `మనం` దర్శకుడి ప్రేమకథా చిత్రం?
`మనం`(2014)... యువ సామ్రాట్ నాగచైతన్య కెరీర్ లో మెమరబుల్ ఫిల్మ్. తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, శ్రీమతి సమంతతో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమది. అలాంటి `మనం`ని రూపొందించిన ఘనత దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ది. కాగా, తనకి `మనం` రూపంలో మెమరబుల్ ఫిల్మ్ ని అందించిన విక్రమ్ తో మరోసారి జట్టుకట్టబోతున్నాడట చైతూ.

నందమూరి బాబాయ్ - అబ్బాయ్ ల చిత్రాల్లో శ్రియ?
నందమూరి బాబాయ్ నటసింహ బాలకృష్ణతోనూ, అబ్బాయ్ యంగ్ టైగర్ యన్టీఆర్ తోనూ ఆడిపాడిన కథానాయికల్లో శ్రియ ఒకరు. బాలయ్యతో `చెన్నకేశవరెడ్డి`(2002), `గౌతమీపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్`(2017) చిత్రాల్లో రొమాన్స్ చేసిన శ్రియ.. తారక్ తో `నా అల్లుడు`(2005)లో జోడీ కట్టింది. అయితే, ఒకే సమయంలో వీరిద్దరి చిత్రాల్లో శ్రియ నటించిన సందర్భాలు మాత్రం లేవు.

క్రిష్ చిత్రంలో పవన్ ద్విపాత్రాభినయం?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడట. అందులో ఒకటి రాబిన్ హుడ్ తరహా పాత్ర కాగా.. మరొకటి మాత్రం చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందట. త్వరలోనే పవన్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వస్తుంది.

మరోసారి రవితేజకి జోడీగా త్రిష?
పన్నెండేళ్ళ క్రితం సంక్రాంతికి విడుదలై విజయం సాధించిన చిత్రం `కృష్ణ` (2008). మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో టాలెంటెడ్ బ్యూటీ త్రిష నాయికగా నటించింది. ఆ సినిమా తరువాత ఈ జోడీ మళ్ళీ సందడి చేయనేలేదు. కట్ చేస్తే.. పుష్కరకాలం తరువాత రవితేజ, త్రిష కలసి నటించేందుకు రంగం సిద్ధమవుతోందట.

కరోనా కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే పలు పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అనుమానిత కేసులు మాత్రం చాలానే నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణాలో 30కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 31వ వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వాలు.

పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!
టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎంతమంది హీరోలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. అలాగే ఎన్టీఆర్ నటన కూడా డిఫరెంట్. ఇక ఈ విషయాన్నే చెబుతూ.. వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని ప్రశంశించారు. రాజమౌళి మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించే దర్శకుడు అని.. తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తి... ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్…

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ
1974 సంవత్సరంలో "శ్రీనివాస కల్యాణ" మూవీ తో శివరాజ్ కుమార్ బాల నటుడిగా కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి 1986 సంవత్సరంలో "ఆనంద్ " మూవీ తో హీరోగా మారారు. సుమారు 140 మూవీస్ లో నటించి కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్నశివరాజ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

"ఉప్పెన" మూవీ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా "ఉప్పెన" మూవీరూపొందింది. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ మూవీ లో కృతి శెట్టి కథానాయిక. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం విశేషం.

"వకీల్ సాబ్ " లో పవన్ కళ్యాణ్ స్పెషల్ సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ జోడీగా శృతి హాసన్ ఎంపిక అయ్యారు. నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలోనటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నారు.

ఆ లిస్ట్ లో మణిరత్నం కొడుకు కూడా..!
కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించి పోయింది. రోజు రోజుకి ఈ వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటంతో.. ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. అంతేకాదు ఎవరికి వారు స్వయంగా జాగ్రత్తులు తీసుకుంటున్నారు. స్వతహాగా గృహ నిర్బంధం అవుతున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ అందరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

తమన్నా షూటింగ్ అనుభవాలు
కరోనా వైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న స్టార్ హీరోయిన్ తమన్నా తన షూటింగ్ అనుభవాలు, మూవీ కమిట్ మెంట్స్ గురించి మీడియా కు వెల్లడించారు. ముందుగా బ్లాక్ బస్టర్ "బాహుబలి " మూవీ గురించి తమన్నా మాట్లాడుతూ .. కుండపోత వర్షాలలో మహాబలేశ్వర్ లో తనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని , మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్న ప్రాంతాలలో షూటింగ్ జరిగిందని, తాను షూటింగ్ లో ఉండగా తన గ్రాండ్ మదర్ మరణించారని, యూనిట్ సభ్యులందరూ తనకు సపోర్ట్ గా నిలిచారని చెప్పారు.

బాలీవుడ్ కి వెళ్తున్న భీష్మ..!
మన తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి నిర్మాతలు. ఇప్పటికే పలు సినిమాలు హిందీలో రీమేక్ చేసుకున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక నాని జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను సైతం కొనేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు…