మ‌ల‌యాళ రీమేక్ లో బాల‌కృష్ణ‌?

Nandamuri Balakrishna To Act In A Telugu Remake Of A Malayalam Movie

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప‌లు రీమేక్ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా… ఘ‌న‌విజ‌యాల‌ను సైతం అందుకున్నారు. త‌న కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల‌చిన `మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావ‌య్య‌`, `ల‌క్ష్మీ న‌ర‌సింహ‌`… ఇలా ప‌లు స‌క్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ న‌టించిన వైనం బాల‌య్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమా చేయ‌నున్న న‌ట‌సింహ‌… త్వ‌ర‌లో ఓ రీమేక్ ఫిల్మ్ లో న‌టించే అవ‌కాశ‌ముందట‌. అది కూడా.. ఓ మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్ట్ కోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ మ‌ల్టీస్టార‌ర్ ని నిర్మించ‌నుంద‌ని… అందులో ఒక క‌థానాయ‌కుడిగా బాల‌య్య అయితేనే బావుంటుంద‌ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ పై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.