కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 150

సినిమా వార్తలు

నంబ‌ర్ వ‌న్ స్థానంంలో “రాములో రాములా”

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `అల‌ వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని పాట‌ల‌న్నీ చార్ట్ బ‌స్ట‌ర్స్ గా నిలిచాయి. మ‌రీ ముఖ్యంగా... “రాములో రాములా” ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పెతురాజ్, జ‌య‌రామ్, ట‌బు తదిత‌రుల‌పై చిత్రీక‌రించిన ఈ పార్టీ సాంగ్ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించింది. కేవ‌లం థియేట‌ర్ల‌లోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

`ఆర్ ఆర్ ఆర్`... మే 20న య‌న్టీఆర్ స్పెష‌ల్ వీడియో?

కొమ‌రం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం ర‌ణం రుధిరం). ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి... ఇటీవ‌ల మోష‌న్ పోస్ట‌ర్ ని, రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ వీడియోని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. వీటికి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా, త్వ‌ర‌లో మ‌రో స్పెష‌ల్ వీడియోని రిలీజ్ చేయ‌డానికి ఫిల్మ్ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్.

Team TFNవాట్సాప్
Bunny - Sukumar New Movie First look and Title Will Be Unveiled On This Special Day
ఫస్ట్ లుక్

బ‌న్నీ - సుక్కు మూవీ ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ అప్‌డేట్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అచ్చొచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం 'ఆర్య`.. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలవ‌గా, మ‌లి చిత్రం 'ఆర్య 2' మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే... పదేళ్ళ తరువాత ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారిప్పుడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రధానంగా చిత్తూరు నేపథ్యంలో సాగుతుందట. బన్నీ కూడా చిత్తూరు యాసతో సరికొత్త లుక్‌లో సందడి చేస్తాడని టాక్. అంతేకాదు... ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో బ‌న్నీ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Blockbuster Movie Jalsa Completes 12 Years
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘జ‌ల్సా’కి 12 ఏళ్ళు

తెలుగునాట ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ది విజ‌య‌వంత‌మైన జోడీ. అలాంటి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్రం ‘జ‌ల్సా’. ఇలియానా, పార్వతి మెల్ట‌న్ నాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో క‌మ‌లిని ముఖ‌ర్జీ, ముకేష్ రుషి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్ర‌కాష్ రాజ్, అలి, బ్ర‌హ్మానందం, సునీల్, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, శివాజి తదిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. తొలిసారి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన ఈ యాక్ష‌న్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను... గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్?

సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. "సాహో" మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టూడెంట్ లీడర్ పాత్రలో సాయి తేజ్

భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక పొలిటికల్ డ్రామా రూపొందనున్న విషయం తెలిసిందే. నేటి విద్యావిధానం లో లోటుపాట్లు నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ లో సాయితేజ్ స్టూడెంట్ లీడర్ గా నటించనున్నారు. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్రకై ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Prabhas 20 Going To Be A Visual Treat For Movie Lovers
సినిమా వార్తలు

విజువల్ ట్రీట్ #Prabhas 20 - పూజాహెగ్డే

"జిల్ " మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా పీరియాడిక్ లవ్ స్టోరీ "#Prabhas 20" మూవీ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇంకొక షూటింగ్ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్‌తో మారుతి ఫ్యామిలీ డ్రామా?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం `నేను శైల‌జ‌` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్న ‘రెడ్‌’తో బిజీగా ఉన్నాడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘త‌డ‌మ్‌’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రామ్ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. స్ర‌వంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఏప్రిల్ 9న విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా కరోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే... రామ్ తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Legendary Director Vijaya Nirmala Collector Vijaya Completes 32 Years
సినిమా వార్తలు

విజ‌య‌నిర్మ‌ల ‘క‌లెక్ట‌ర్ విజ‌య‌’కు 32 ఏళ్ళు

దిగ్గ‌జ న‌టీమ‌ణి, మ‌హిళా ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల తెరకెక్కించిన ప‌లు కుటుంబ క‌థా చిత్రాలు మ‌హిళా లోకం నీరాజ‌నాలు అందుకోవ‌డ‌మే కాకుండా... బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించాయి. అటువంటి వాటిలో ‘క‌లెక్ట‌ర్ విజ‌య’ ఒక‌టి. విజ‌య‌నిర్మ‌ల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ముర‌ళీమోహ‌న్, న‌రేష్, ర‌మ్య‌కృష్ణ‌, గుమ్మ‌డి, కోట శ్రీ‌నివాస‌రావు, సుధాక‌ర్, త్యాగ‌రాజు, సుత్తివేలు, అన్న‌పూర్ణ‌, ముచ్చ‌ర్ల అరుణ త‌దిత‌రులు ముఖ్య‌ పాత్ర‌లు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"ఉప్పెన "మూవీ లో విజయ్ సేతుపతి ఇంటెన్స్ లుక్

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో "ఉప్పెన"మూవీ రూపొందిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తమిళ సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల "F2", వేంకటేష్ , నాగచైతన్య "వెంకీ మామ" మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ "V" విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్... వ‌రుస‌గా మూడోసారి?

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్... త‌న కెరీర్ లోనే ఎన్న‌డూ లేని విధంగా ఒకే బ్యానర్ లో వ‌రుస చిత్రాలు చేస్తున్నాడా? అవున‌నే వినిపిస్తోంది ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో. ఆ వివ‌రాల్లోకి వెళితే... త‌న‌తో `బ్రూస్ లీ`(2015) చిత్రాన్ని నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య కాంబినేష‌న్ లో రీసెంట్ గా చ‌ర‌ణ్ `విన‌య విధేయ రామ‌`(2019) చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న రాజ‌మౌళి డైరెక్టోరియ‌ల్ `ఆర్ ఆర్ ఆర్` (రౌద్రం ర‌ణం రుధిరం) కూడా డీవీవీ దాన‌య్య నిర్మాణంలో తెర‌కెక్కుతున్న‌దే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రీష్ శంక‌ర్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `గ‌బ్బ‌ర్ సింగ్‌` (2012) ఒక‌టి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్... అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ ద్వ‌యం మ‌రోమారు జ‌ట్టుకట్ట‌నున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్ర‌భాస్ మూవీ కోసం భారీ హాస్పిట‌ల్ సెట్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ‘జిల్’ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ పీరియాడిక్ ల‌వ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ‘రాధే శ్యామ్’, `ఓ డియ‌ర్` అనే టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే న‌టిస్తోంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్ర‌స్ భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఇదిలా ఉంటే... ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ప్ర‌భాస్ గెట‌ప్స్ కి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ మెగా ఈవెంట్ క్యాన్సిల్..!

కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ లు ఆగిపోయాయి. ఇక హీరోలు కూడా తమ ప్రోగ్రామ్స్ ను క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు మెగా ఈవెంట్ ను క్యాన్సిల్ చేసాడు. బన్నీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు అయిపోయిన నేపథ్యంలో ఒక మెగా ఈవెంట్ ను నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా వల్ల సీన్ రివర్స్ అయింది. ఈ బిగ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ ఒక్క మాట పాయల్ ను మార్చేసింది...!

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 2కోట్ల లోపు బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట చేసింది. ఐతే ఇంత పెద్ద హిట్ట‌యిన సినిమాలో నటించడానికి హీరోయిన్స్ ఎవరూ ముందుకు రాలేదంటా. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?

మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవును నేను బన్నీ గొడవపడ్డాం..!

అవును నేను-బన్నీ కొట్టుకున్నాం అని అంటున్నాడు అల్లు శిరీష్. అవునా నిజంగానే శిరీష్-బన్నీ గొడవపడ్డారా అని ఆలోచనలో పడ్డారా..? అయితే అదంతా నిజంకాదులెండి.. అసలు ఈ గొడవ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు కథలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే... సోషల్ మీడియా లో ఒక అభిమాని.. అన్నా నువ్వు, బన్నీ ఎప్పుడైనా గొడపపడ్డారా అని అడుగగా.. దానికి శిరీష్ అవును చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతున్నప్పుడు కొట్టుకున్నాం... బాగానే తగిలాయి నాకు కానీ ఆ రివెంజ్ క్రికెట్ లో తీర్చుకున్నా అని చెప్పాడు.. మరో అభిమాని ట్విట్టర్ కి వచ్చేయి అన్నా.. బోలెడంత కాలక్షేపం అని అనగా.. ఒకప్పుడు వచ్చేవాడిని ఫన్ కోసం.. కానీ ఫ్యాన్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో #Prabhas 20

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ టైనర్ "#Prabhas 20" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న " #Prabhas 20" మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలాఉండగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో బాలీవుడ్‌…

TFN Adminవాట్సాప్

షేర్