అల్లు అర్జున్ మెగా ఈవెంట్ క్యాన్సిల్..!

కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. రిలీజ్ లు ఆగిపోయాయి. ఇక హీరోలు కూడా తమ ప్రోగ్రామ్స్ ను క్యాన్సిల్ చేసుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు మెగా ఈవెంట్ ను క్యాన్సిల్ చేసాడు. బన్నీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 17 ఏళ్ళు అయిపోయిన నేపథ్యంలో ఒక మెగా ఈవెంట్ ను నిర్వహించాలనుకున్నారు. కానీ కరోనా వల్ల సీన్ రివర్స్ అయింది. ఈ బిగ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశారు. అంతేకాదు టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ అందరినీ పిలిచి మరీ పెద్ద పార్టీ ఇచ్చాడు.

ఇక తన తర్వాతి సినిమా సుకుమార్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మరి ఇప్పటికే ఆర్య, ఆర్య2 వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసిన వీరి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి హ్యాట్రిక్ కొడతారేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 9 =