మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?

Nandamuri Balakrishna To Act In A Multi Starrer Movie

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల “F2”, వేంకటేష్ , నాగచైతన్య “వెంకీ మామ” మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ “V” విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పృథ్వి రాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రలలో రూపొందిన “అయ్యప్పనుమ్ కోషియం ” మలయాళ మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఒక రిటైర్డ్ హవాల్దార్, ఒక పోలీస్ ఆఫీసర్ మధ్య ఇగో నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ స్వంతం చేసుకుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయనుంది. ఒక క్యారెక్టర్ లో రానా దగ్గుబాటి ఎంపిక అయినట్టు, మరో క్యారెక్టర్ కు బాలకృష్ణ ఎంపిక అయినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =