
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 151

రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు
నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా
కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?
వెంకటేష్ ‘గురు’కు మూడేళ్ళు

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
`ఆచార్య` ఫస్ట్ లుక్ అప్ డేట్
బయోపిక్ మూవీ లో సమంత ?
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్

నాగార్జున ‘శ్రీరామదాసు’కు 14 ఏళ్ళు

మరోసారి అజిత్ ద్విపాత్రాభినయం?

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే...ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.
రిలాక్సింగ్ మూడ్ లో మహేష్ బాబు
మనకున్న మూవీ సూపర్ స్టార్స్ లో కూలెస్ట్ పర్సన్ మహేష్ బాబు అని చెప్పడంలో సందేహం లేదు. మామూలుగానే కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. రిలాక్స్ మూడ్ లో పైజామా ధరించి సోఫా లో కూర్చుని చిరు నవ్వులు చిందిస్తున్న మహేష్ బాబు ఫోటో ను ఆయన సతీమణి నమ్రత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా
'తేనె మనసులు' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి... సూపర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్, సంధ్యారాణి, సుకన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 1965 మార్చి 31న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేటితో ఈ సినిమా 55 వసంతాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ఈయన. ఫస్ట్ 70 ఎమ్ఎమ్, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్, ఫస్ట్ కౌబాయ్ ఇలా అన్నింటి సూపర్ స్టార్ పేరే ఉంటుంది. మొదటి కౌబాయ్, మొదటి జేమ్స్ బాండ్ సినిమా ఇలా ఏ కొత్త ప్రయోగం చేయాలన్నా సూపర్ స్టార్ కృష్ణ తర్వాతే.
కోలీవుడ్ లో పూజాహెగ్డే రీ ఎంట్రీ ?
కోలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయ చిత్రం "ముగమూడి" 2012 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించినది. ఆ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం " మూవీ తో టాలీవుడ్ కు పూజాహెగ్డే పరిచయం అయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన DJ, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం "Prabhas 20 ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ తొలి చిత్రం ‘తేనెమనసులు’కు 55 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగునాట పలు ప్రయోగాలకు చిరునామాగా నిలచిన లెజెండరీ యాక్టర్. అలాంటి కృష్ణ వెండితెరపై తొలిసారి వెలుగులు పంచిన చిత్రం `తేనెమనసులు`.
వెంకటేష్ ‘గురు’కు మూడేళ్ళు
రీమేక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన తెలుగు కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి పలు రీమేక్ మూవీస్‌లో నటించడమే కాకుండా... సింహభాగం ఘనవిజయాలు అందుకున్నారాయన. అలా విజయం సాధించిన వెంకీ రీమేక్ మూవీస్ లో ‘గురు’ ఒకటి. బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ దర్శనమిచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రితికా సింగ్ బాక్సర్‌గా నటించింది. నాజర్, తనికెళ్ళ భరణి, ముంతాజ్ సర్కార్, రఘుబాబు, జాకీర్ హుస్సేన్, అనంత్ బాబు, సంచనా నటరాజన్, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే... నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.
యన్టీఆర్‌తో జాన్వీ కపూర్?
`అరవింద సమేత` వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం విదితమే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వేసవి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
`ఆచార్య` ఫస్ట్ లుక్ అప్ డేట్
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడని టాక్. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నాడు.
బయోపిక్ మూవీ లో సమంత ?
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
అల్లు అర్జున్ పై దిశా పటాని ప్రశంసలు
కరోనా వైరస్ నివారణ కై ప్రధాని మోదీ 21రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంతమంది సెలబ్రిటీస్ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ అవుట్స్, కుకింగ్, గేమ్స్, రీడింగ్, టీవీ చూస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీస్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్నారు.

కరోనా కట్టడి కై హీరో నితిన్ సందేశం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రధాని మోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ కట్టడికై కేంద్ర, తెలుగు రాష్ట్రాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కరోనా వైరస్ నివారణ కై ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హీరో నితిన్ ప్రజలకు, తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్
కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంత మంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా బయట తిరుగుతున్నారు. దానికి పర్యవసానం ప్రజలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని పూరి జగన్నాథ్ కోరారు.

హీరో నితిన్ కు భవ్య క్రియేషన్స్ బర్త్ డే శుభాకాంక్షలు
సూపర్ హిట్ "కార్తికేయ ", "ప్రేమమ్ " మూవీస్ ఫేమ్, వైవిధ్య భరిత చిత్ర దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలలో యాక్షన్ ఎంటర్ టైనర్ భవ్య ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 12 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

నాగార్జున ‘శ్రీరామదాసు’కు 14 ఏళ్ళు
కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఆరంభంలో కమర్షియల్ మూవీస్‌తో ఆకట్టుకున్న ఈ ద్వయం... ఆపై భక్తిరస చిత్రాల బాట పట్టి ప్రేక్షకులను మైమరపించారు. అలాంటి వీరిద్దరి కలయికలో ‘అన్నమయ్య’(1997) వంటి జనరంజక చిత్రం తర్వాత వచ్చిన సినిమా ‘శ్రీరామదాసు’. ఇందులో శ్రీరామచంద్రుని సాక్షాత్కారం కోసం పరితపించిన పరమ భక్తుడు “రామదాసు” పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. నాగ్ కి జంటగా స్నేహ నటించిన ఈ చిత్రంలో సుమన్ శ్రీరాముడి పాత్రలో దర్శనమివ్వగా... అక్కినేని నాగేశ్వరరావు, నాజర్, నాగబాబు, అలీ, వేణుమాధవ్, సునీల్, వేద, సుజాత, సుధ, హేమ తదితరులు…

మరోసారి అజిత్ ద్విపాత్రాభినయం?
గత ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, దర్శకుడు హెచ్.వినోద్. కాగా, ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో `వలిమై` పేరుతో మరో సినిమా రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నాడని సమాచారం.

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి విడుదల కానున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

"రంగ్ దే! " మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్, "మహానటి" కీర్తి సురేష్ జంటగా సూపర్ హిట్ "తొలిప్రేమ" ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే! " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

నాని ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ్ రాయ్’ అప్ డేట్స్
ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘టక్ జగదీష్’ కాగా... మరొకటి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘టక్ జగదీష్’కు సంబంధించి ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా... సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

కరోనా మహమ్మారి జాగ్రత్తలపై వీడియో సాంగ్
కరోనా మహమ్మారి కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పై అవగాహన తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి ఒక సాంగ్ ను కంపోజ్ చేశారు. కోటి స్వరకల్పనలో కోటి ఆలపించిన ఈ సాంగ్ లో చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అభినయించారు.