ఆ ఒక్క మాట పాయల్ ను మార్చేసింది…!

That One Word Changed Payal Rajput Film Career
That One Word Changed Payal Rajput Film Career

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 2కోట్ల లోపు బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ క‌లెక్ట చేసింది. ఐతే ఇంత పెద్ద హిట్ట‌యిన సినిమాలో నటించడానికి హీరోయిన్స్ ఎవరూ ముందుకు రాలేదంటా. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ సినిమాను గురించి ఓ ఇంటర్వ్యూలో అజయ్ భూపతి మాట్లాడుతూ, “ఈ సినిమా కథ అంతా కూడా ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను తెలుగు కథానాయికలలో ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించి, వాళ్లందరినీ సంప్రదించాను. కానీ వాళ్లెవరూ ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇక ఇక్కడ వర్కౌట్ కాక.. ముంబై వెళ్లి అక్కడ పాయల్ ను ఎంపిక చేసుకున్నాడట. ఇక సినిమా ప్రారంభమైన కొన్ని రోజుల పాటు ఆమె కూడా ఏదో మొక్కుబడిగా షూటింగుకి వచ్చి వెళ్లేది. అది గమనించిన నేను ‘ఈ సినిమాకి మీ పాత్రనే కీలకం .. మీరు ఇలా చేస్తే మీ పాత్ర చెడిపోతుంది .. యూనిట్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది’ అని చెప్పాను. అప్పటి నుంచే ఆమె పాత్రలో ఇన్వాల్వ్ కావడం మొదలు పెట్టింది. ఆ కారణంగానే ఆ పాత్ర అంతగా పండింది .. ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో ఆమె నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా పాయల్ కు మంచి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.