ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 149
ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్

"తలైవి " మూవీ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నటుడు ?
బన్నీ, సుక్కు... ఓ రెండక్షరాల టైటిల్

‘ఆచార్య’ ఆగమనం అప్పుడేనా?
పవన్ - హరీష్ సినిమాలో పూజా హెగ్డే?
షారుఖ్ తో అట్లీ సినిమా కన్ఫామే..!
స్టార్ రైటర్ అబ్బూరి రవికి మాతృ వియోగం

సరిలేరు నీకెవ్వరు - 15 ఇయర్స్ ఆల్ టైం రికార్డ్
పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రాక్టీస్
అమలా పాల్ భావోద్వేగం..నేను మొత్తం కోల్పోయాను
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు
హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు
లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!
మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?
చాలా కష్టమైన సన్నివేశం - సాయి పల్లవి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఫిదా " మూవీ ఘనవిజయం సాధించింది. సాయి పల్లవి కథానాయికగా టాలీవుడ్ కు పరిచయ చిత్రం "ఫిదా" లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సాయి పల్లవి "ఫిదా" మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
ఫిమేల్ సెంట్రిక్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్
తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ భాషా చిత్ర నటి, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన థ్రిల్లర్ మూవీ "రాక్షసుడు " ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం సూపర్ హిట్ "నిన్నుకోరి " తమిళ రీమేక్ మూవీ, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. అనుపమ ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"తలైవి " మూవీ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నటుడు ?
విబ్రి మీడియా, కర్మా మీడియా &ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి " మూవీ తమిళ , తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత రీల్, రియల్ లైఫ్ లో జరిగిన ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న "తలైవి " మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత, అరవింద్ స్వామి MGR, ప్రకాష్ రాజ్ కరుణానిథి , శోభన్ బాబు జిషు సేన్ గుప్తా, శశికళ గా పూర్ణ నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్, రచిత అరోరా సంగీతం అందించారు.

యన్టీఆర్, చిరంజీవి కాంబినేషన్ మూవీ `తిరుగులేని మనిషి`కి 39 ఏళ్ళు
రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు ఒకే సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం అరుదైన విశేషం. అలాంటి... విశేషానికి చిరునామాగా నిలిచిన ఆ చిత్రం `తిరుగులేని మనిషి` కాగా... ఆ రెండు తరాల నంబర్ వన్ కథానాయకులు మహానటుడు నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరూ బావ, బావమరిది పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. యన్టీఆర్‌కి జోడిగా రతి అగ్నిహోత్రి, చిరుకి జంటగా “ఫటాఫట్” జయలక్ష్మి నటించిన ఈ సినిమాలో సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
బన్నీ, సుక్కు... ఓ రెండక్షరాల టైటిల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘ఆర్య’తో తెలుగునాట దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్. అంతేకాదు... మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు కూడా. అనంతరం బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ హిట్ ‘ఆర్య 2’తో ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేశాడు. కట్ చేస్తే... పదేళ్ళ విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి తన లక్కీ హీరో కాంబోలో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధపడుతున్న సుక్కు... ఈసారి కూడా తన గత సినిమాల సెంటిమెంట్‌నే కంటిన్యూ చేయనున్నట్టు సమాచారం.

‘ఆచార్య’ ఆగమనం అప్పుడేనా?
‘సైరా నరసింహారెడ్డి’ వంటి పేట్రియాటిక్ డ్రామా తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో చిరుకి జోడిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. కాగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని... తొలుత ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడినట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ - హరీష్ సినిమాలో పూజా హెగ్డే?
‘గబ్బర్ సింగ్’ (2012) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి జట్టుకట్టనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం పవన్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం మరోసారి ఫక్తు మాస్ ఎంటర్‌టైనర్ ని సిధ్ధం చేస్తున్నాడు హరీష్. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం చివరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

ప్రభాస్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం `బిల్లా`కి 11 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అచ్చొచ్చిన కథానాయికల్లో అనుష్క ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలన్నీ విజయపథంలో పయనించాయి. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘బిల్లా’. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రభాస్ హోమ్ బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ సంస్థ నిర్మించింది. ఇందులో బిల్లా, రంగా అనే రెండు విభిన్న పాత్రల్లో సందడి చేశాడు డార్లింగ్. ప‌్రభాస్ కెరీర్ లో ఇదే తొలి ద్విపాత్రాభినయ చిత్రం కావడం విశేషం. అలాగే తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజుతోనూ మొదటిసారి కలసి నటించిన సినిమా కూడా `బిల్లా`నే కావడం మరో విశేషం.
షారుఖ్ తో అట్లీ సినిమా కన్ఫామే..!
'రాజా రాణి' లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీతో మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ డైరెక్టర్ అట్లీ. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలు 'తేరి', 'మెర్సల్', 'బిగిల్' తమిళ్ స్టార్ హీరో విజయ్ తో తీసి వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఆశర్యం ఏంటంటే మూడు సినిమాలు హిట్టే. అలా నాలుగు సినిమాలకే స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
స్టార్ రైటర్ అబ్బూరి రవికి మాతృ వియోగం
స్టార్ రైటర్ అబ్బూరి రవి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లలిత (73) నిన్న తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె.. నిన్న సాయంత్రం గుండె పోటుతో మరణించారు. ఈరోజు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్య క్రియలు నిర్వహించారు. ఇక ఆమె మృతిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ అబ్బూరి రవికి.. అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు - 15 ఇయర్స్ ఆల్ టైం రికార్డ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసిన సంగతి విదితమే. అయినా కూడా ఇప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా బుల్లి తెరపై కూడా ప్రభంజనం సృష్టించింది.
పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రాక్టీస్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయినపంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. "RDX లవ్, "వెంకీ మామ ", "డిస్కో రాజా" వంటి మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. "ఏంజెల్ " తమిళ మూవీ తో కోలీవుడ్ కు పాయల్ పరిచయం అవుతున్నారు.
అమలా పాల్ భావోద్వేగం..నేను మొత్తం కోల్పోయాను
తన అందం, అభినయంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్ ఈ మధ్య వక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మొదటి పెళ్లితో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక ఇటీవలే రెండో పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది. రెండో పెళ్లి, తాను చేసిన ఫొటోలపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయడం, తాను అసలు పెళ్లే చేసుకోలేదని చెప్పడం ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయితే ఈసారి ఏ కాంట్రవర్సీకి సంబంధించిన పోస్ట్ కాదులెండి.
అజయ్ దేవగన్ కు "RRR"మూవీ యూనిట్ శుభాకాంక్షలు
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ పాల్గొన్న ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.
హీరో నాని పై పూజాహెగ్డే ప్రశంసలు
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే రీసెంట్ గా జార్జియా లో జరిగిన "Prabhas 20 మూవీ షూటింగ్ లో పాల్గొని ఇండియా తిరిగి వచ్చిన తరువాత స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయిన పూజాహెగ్డే మీడియా తో సమావేశమయ్యారు.
లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తప్పా బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ... ఫ్యామిలీతో... ఆట పాటలతో.. ఇంకొంతమంది గరిటె చేతబట్టి వంటలు చేస్తూ.. ఇలా పలు పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నారు.
మహేష్ ను డైరెక్ట్ చేయాలనుంది..!
'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు ఫలక్‌నుమా దాస్ అదే యాక్టర్ విశ్వక్ సేన్. ఇక రీసెంట్ గా నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ?
దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

"క్రాక్ " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ అందించారు.

ఏయన్నార్ అభినయపర్వంలో కలికితురాయి ‘మహాకవి కాళిదాసు’కు 60 ఏళ్ళు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు చారిత్రాత్మక చిత్రాలు ప్రేక్షకులను అలరించడమే కాదు... వాటిలో కొన్ని చిరస్థాయిగా నిలచిపోయాయి కూడా. అటువంటి చిత్రాల్లో ‘మహాకవి కాళిదాసు’ ఒకటి. “పౌరాణిక బ్రహ్మ” కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏయన్నార్‌కు జోడిగా జూనియర్ శ్రీరంజని నటించారు. యస్.వి.రంగారావు, సి.యస్.ఆర్, రేలంగి, వంగర, ముదిగొండ లింగమూర్తి, రాజసులోచన, సంధ్య, వాసంతి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. కన్నడ మూవీ ‘మహాకవి కాళిదాస’(1955)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు.