బ‌న్నీ – సుక్కు మూవీ ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ అప్‌డేట్ ?

Bunny - Sukumar New Movie First look and Title Will Be Unveiled On This Special Day

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అచ్చొచ్చిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘ఆర్య`.. బన్నీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌లా నిలవ‌గా, మ‌లి చిత్రం ‘ఆర్య 2’ మ్యూజిక‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కట్ చేస్తే… పదేళ్ళ తరువాత ఈ ఇద్దరూ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారిప్పుడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రధానంగా చిత్తూరు నేపథ్యంలో సాగుతుందట. బన్నీ కూడా చిత్తూరు యాసతో సరికొత్త లుక్‌లో సందడి చేస్తాడని టాక్. అంతేకాదు… ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో బ‌న్నీ తొలిసారి ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాలోని అల్లు అర్జున్ పాత్ర‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏప్రిల్ 8న విడుద‌ల‌ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని… హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ద‌స‌రా సీజ‌న్‌లో బ‌న్నీ – సుక్కు చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.