దిగ్గజ నటీమణి, మహిళా దర్శకురాలు విజయనిర్మల తెరకెక్కించిన పలు కుటుంబ కథా చిత్రాలు మహిళా లోకం నీరాజనాలు అందుకోవడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అటువంటి వాటిలో ‘కలెక్టర్ విజయ’ ఒకటి. విజయనిర్మల ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మురళీమోహన్, నరేష్, రమ్యకృష్ణ, గుమ్మడి, కోట శ్రీనివాసరావు, సుధాకర్, త్యాగరాజు, సుత్తివేలు, అన్నపూర్ణ, ముచ్చర్ల అరుణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి గీత రచన చేయగా… బప్పీలహరి, రమేష్ నాయుడు, కృష్ణ – చక్ర స్వరాలు సమకూర్చారు. “సిరిమల్లెదండలు” (రమేష్ నాయుడు), “లవ్ లవ్ లవ్ లవ్”, “చేసేదేదో చేసెయ్”, “నీవు చెంత చేరితే”(బప్పీలహరి)… వంటి గీతాలు శ్రోతలను అలరించాయి. సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో శ్రీ విజయకృష్ణా మూవీస్ పతాకంపై ఎస్.రమానంద్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1988 ఏప్రిల్ 1న విడుదలైన ‘కలెక్టర్ విజయ’… నేటితో 32 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: