అవును నేను బన్నీ గొడవపడ్డాం..!

Me and Bunny Used To Fight With Each Other In Our Childhood Days Says Allu Sirish
Me and Bunny Used To Fight With Each Other In Our Childhood Days Says Allu Sirish

అవును నేను-బన్నీ కొట్టుకున్నాం అని అంటున్నాడు అల్లు శిరీష్. అవునా నిజంగానే శిరీష్-బన్నీ గొడవపడ్డారా అని ఆలోచనలో పడ్డారా..? అయితే అదంతా నిజంకాదులెండి.. అసలు ఈ గొడవ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం అసలు కథలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే… సోషల్ మీడియా లో ఒక అభిమాని.. అన్నా నువ్వు, బన్నీ ఎప్పుడైనా గొడపపడ్డారా అని అడుగగా.. దానికి శిరీష్ అవును చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతున్నప్పుడు కొట్టుకున్నాం… బాగానే తగిలాయి నాకు కానీ ఆ రివెంజ్ క్రికెట్ లో తీర్చుకున్నా అని చెప్పాడు.. మరో అభిమాని ట్విట్టర్ కి వచ్చేయి అన్నా.. బోలెడంత కాలక్షేపం అని అనగా.. ఒకప్పుడు వచ్చేవాడిని ఫన్ కోసం.. కానీ ఫ్యాన్స్ వార్ ఎక్కువైంది.. అనవసరమైన నెగిటివిటీ.. అందుకే తగ్గించేసా అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఫ్యాన్స్ వార్ శిరీష్ ను గట్టిగానే హర్ట్ చేసినట్టుంది. ఒక్క శిరీష్ మాత్రమే కాదు నెటిజన్ల దాడికి బలైన సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. మరి నెటిజన్లు కాస్త అలోచించి కెమెంట్స్ చేస్తే బెటర్..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

అల్లు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. శిరీష్ చేసిన లాస్ట్ మూవీ ఏబీసీడీ. ఇక ఆ సినిమా కూడా పెద్దగా ఆడిందిలేదనుకోండి. ఇప్పుడు కాస్త లాంగ్ గ్యాప్ తీసుకొని మరో సినిమాతో రాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ నటించిన విజేత చిత్రాన్ని రూపొందించిన రాకేష్ శశి డైరెక్షన్‌లో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాను ఇటీవలే మొదలుపెట్టాలనుకున్నారు కానీ… అదే టైం కి కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వచ్చి పడింది. దీనితో షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో శిరీష్ కు జోడిగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 3 =