కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి… ఇటీవల మోషన్ పోస్టర్ ని, రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. కాగా, త్వరలో మరో స్పెషల్ వీడియోని రిలీజ్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ సినిమాలోని యన్టీఆర్ పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియోని… తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అల్లూరి పాత్రధారి చరణ్ ని పరిచయం చేస్తూ తారక్ ఎలాగైతే వాయిస్ ఓవర్ ఇచ్చాడో… అదే తీరున కొమరం పాత్రధారి తారక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ చరణ్ గాత్రమందిస్తాడని తెలిసింది. మరి.. కొమరం భీమ్ గా తారక్ ఏ స్థాయిలో రంజింపజేస్తాడో చూడాలి.
దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామాకి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న `ఆర్ ఆర్ ఆర్` ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: