ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రీష్ శంక‌ర్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్

Power Star Pawan Kalyan Teams Up With Director Harish Shankar After Gabbar Singh

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `గ‌బ్బ‌ర్ సింగ్‌` (2012) ఒక‌టి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్… అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ ద్వ‌యం మ‌రోమారు జ‌ట్టుకట్ట‌నున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, `గ‌బ్బ‌ర్ సింగ్` త‌ర‌హాలోనే ప‌వ‌న్ – హ‌రీష్ సెకండ్ జాయింట్ వెంచ‌ర్ కూడా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. ప‌వ‌న్ ని అత‌ని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో ఆ త‌ర‌హా పాత్ర‌లోనే ప్ర‌జెంట్ చేయ‌నున్నాడ‌ట హ‌రీష్. మ‌రి, ‘గ‌బ్బ‌ర్ సింగ్’ మాదిరిగా వేస‌వికే విడుద‌ల కానున్న ఈ సినిమా కూడా అదే త‌ర‌హా ఫ‌లితాన్ని న‌మోదు చేస్తుందేమో చూడాలి. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ప‌వ‌న్ చేతిలో ‘వ‌కీల్ సాబ్’, క్రిష్ డైరెక్టోరియ‌ల్ ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =