మెగాపవర్ స్టార్ రామ్ చరణ్… తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే బ్యానర్ లో వరుస చిత్రాలు చేస్తున్నాడా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో. ఆ వివరాల్లోకి వెళితే… తనతో `బ్రూస్ లీ`(2015) చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్ లో రీసెంట్ గా చరణ్ `వినయ విధేయ రామ`(2019) చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` (రౌద్రం రణం రుధిరం) కూడా డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కుతున్నదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అంతేకాదు.. చరణ్ హీరోగా నటించబోయే నెక్స్ట్ వెంచర్ కూడా ఇదే బ్యానర్ లో ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద… తను కథానాయకుడిగా నటించే మూడు వరుస చిత్రాలు ఒకే బేనర్ లో చేయడం చరణ్ కిదే తొలిసారి. త్వరలోనే చరణ్ – దానయ్య కొత్త చిత్రంపై క్లారిటీ వస్తుంది. అలాగే దర్శకుడు ఎవరన్నది కూడా స్పష్టత వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: