ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో` చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా… “రాములో రాములా” ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పెతురాజ్, జయరామ్, టబు తదితరులపై చిత్రీకరించిన ఈ పార్టీ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. కేవలం థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ గీతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత ఏడాది దీపావళి పండుగ (అక్టోబర్ 26) సందర్భంగా ఈ పాటని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా… తాజాగా 247 మిలియన్ల (24 కోట్ల) వ్యూస్‌ని క్రాస్ చేసింది. యువ సంగీత సంచలనం థమన్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యం, అనురాగ్ కులకర్ణి, సత్యవతి(మంగ్లి) గానం, పి.యస్.వినోద్ సినిమాటోగ్రఫీ, శేఖర్ మాస్టర్ నృత్యదర్శకత్వం… అన్నింటికి మించి బన్నీ బాడీ లాంగ్వేజ్, హాఫ్ కోట్ స్టెప్పులు… వెరసి `రాములో రాములా`కి ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి.
కాగా… యూట్యూబ్ ఛానల్లో తెలుగు సినిమా పాటలకు సంబంధించి నిన్నమొన్నటివరకు ‘ఫిదా’లోని “వచ్చిండే”(246 మిలియన్ వ్యూస్) నంబర్ వన్ స్థానంలో ఉండగా… ఇప్పుడు ఆ స్థానాన్ని “రాములో రాములా” (247 మిలియన్ వ్యూస్) ఆక్రమించడం విశేషం. మున్ముందు… `రాములో రాములా` ఖాతాలో ఇంకెన్ని రికార్డులు చేరుతాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: