తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది విజయవంతమైన జోడీ. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘జల్సా’. ఇలియానా, పార్వతి మెల్టన్ నాయికలుగా నటించిన ఈ సినిమాలో కమలిని ముఖర్జీ, ముకేష్ రుషి, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్, అలి, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శివాజి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తొలిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను… గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్ గీత రచన చేయగా… టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఛార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు. “మై హార్ట్ ఈజ్ బీటింగ్”, “గాల్లో తేలినట్టుందే”, “జెన్నిఫర్ లోపెజ్”, “ఛలోరె ఛలోరె”, “జల్సా”, “యు అండ్ ఐ”… ఇలా అన్ని పాటలు కుర్రకారుని ఉర్రూతలూగించాయి. 2008 ఏప్రిల్ 2న విడుదలై ఘన విజయం సాధించిన ‘జల్సా’… నేటితో 12 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































