మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో తరుణ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రావలసి వుందని… ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ సమాధానం కోసం తరుణ్ వెయిట్ చేస్తున్నాడట. మరి ఎన్టీఆర్ ఏమంటాడో చూద్దాం.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ తరుణ్ తో ఏమన్నా చేస్తాడేమో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























