
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 147

తుది శ్వాస విడిచిన శ్రీలక్మి కనకాల

250 కుటుంబాలకు అండగా 'రకుల్'

'అల వైకుంఠపురములో' భారీ రేటుకు హిందీ హక్కులు
ప్రధాని మోదీ పిలుపుకు టాలీవుడ్ స్పందన
చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం
'ఆచార్య' లో మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలీదు..!

అల్లు అర్జున్ ‘బన్ని’కి 15 ఏళ్ళు
దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే

‘వి’లో అదితిరావ్ హైదరీ విలనిజం?

‘భీష్మ’తో ‘మహానటి’?
ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం
`ఆచార్య’ విడుదల తేదీకి ‘వకీల్ సాబ్’?
పెళ్ళి వార్త పై కీర్తి సురేష్ స్పందన

విజయ్ ను చాలా మిస్ అవుతున్నా..!
నా ఫేవరెట్ హీరోయిన్ తనే..!
మరోసారి క్రేజీ కాంబోలో మూవీ..!

"ఇండియన్ 2(భారతీయుడు 2)" మూవీ లేనట్టేనా ?
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "భారతీయుడు " మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోతున్నట్టు సమాచారం.
తుది శ్వాస విడిచిన శ్రీలక్మి కనకాల
నటుడు రాజీవ్ కనకాల ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. గత ఏడాది వీరి తండ్రిగారైన దర్శకుడు మరియు సీనియర్ నటులు దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన సంగతి విదితమే. ఆ బాధ నుండి ఇంకా కోలుకోకముందే మరో విషాదం నెలకొంది. సోదరి శ్రీలక్ష్మీ అకాల మరణం పొందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.

250 కుటుంబాలకు అండగా 'రకుల్'
కరోనా వైరస్ రోజు రోజు కు వ్యాపిస్తున్న వేళ పేద వాళ్లకు అండగా ఎంతోమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ నుండి సామాన్య ప్రజల దాకా అందరూ పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇక హీరోయిన్ లు కూడా ఒక్కొక్కళ్లు ముందుకొస్తున్నారు. కోట్లకి కోట్లు విరాళాలు ఇవ్వకపోయినా వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే నయన తార 20 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రణీత ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని... తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు తన వంతుగా సాయం చేస్తున్నాని తెలిపింది.

'అల వైకుంఠపురములో' భారీ రేటుకు హిందీ హక్కులు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్, థమన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్మిన సంగతి మనందరికి తెలిసిన సంగతే.
ప్రధాని మోదీ పిలుపుకు టాలీవుడ్ స్పందన
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. మానవాళి బ్రతుకే ప్రశ్నార్ధకరంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వ్యూహాలు రూపొందిస్తున్నాయి. కరోనా ను తరమాలనే ఉద్యమం లో భారతీయుల సమైక్యత నిరూపణ కై ప్రధాని మోదీ ఆదివారం నాడు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలనే పిలుపు తో టాలీవుడ్ స్పందించింది.
చిరు దీపపు వెలుగులో మహేష్ బాబు
వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ కి తన వంతు సాయం అందించిన మహేష్ బాబు ప్రధాని మోదీ పిలుపుకు స్పందించారు.
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం
ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. కరోనా కట్టడి కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలతో ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు సాయం అందించి కృషి చేయవల్సిన అవసరం ఉంది.

'ఆర్ఆర్ఆర్' - చెర్రీ తో అలియా జాయిన్ అయ్యేది అప్పుడే..!
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అలియా తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు తప్పని కూడా క్లారిటీ ఇచ్చారు చిత్రబృందం. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లో అలియా మే నుండి పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ లోపు ఈ కరోనా హడావుడి తగ్గిపోతుంది.. ఆ వెంటనే ఆర్ఆర్ఆర్ లో చెర్రీతో షూట్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
'ఆచార్య' లో మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలీదు..!
కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు కానీ, చరణ్ కానీ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి మహేష్ బాబే నటిస్తున్నాడు అంటారు. మరో రెండు రోజులు ఆగితే లేదు లేదు చరణే నటిస్తున్నాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

అల్లు అర్జున్ ‘బన్ని’కి 15 ఏళ్ళు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పలు విజయవంతమైన చిత్రాలున్నాయి. వాటిలో ‘బన్ని’ ఒకటి. `గంగోత్రి`, `ఆర్య` వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తరువాత వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్... బన్నీకి హ్యాట్రిక్ హిట్ ని అందించింది. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీకి జోడీగా గౌరీ ముంజల్ నటించగా.. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ముకేష్ రుషి, శరత్ సక్సేనా, రఘుబాబు, ‘ఆహుతి’ ప్రసాద్, చలపతిరావు, సీత, సుధ ముఖ్య భూమికలు పోషించారు.
దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే
కరోనా వైరస్ పై పోరాటానికి ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9నిమిషాలపాటు దీప ప్రజ్వలనకై పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. భారతీయుల సమైక్యతా ప్రదర్శనకు ప్రతీకగా దేశవ్యాప్తంగా జరిగిన దీప ప్రజ్వలన జయప్రదం గా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రధాని మోదీ పిలుపుకు మద్దతు తెలిపారు.

‘వి’లో అదితిరావ్ హైదరీ విలనిజం?
‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాలతో తెలుగునాట కథానాయికగా తనదైన ముద్రవేసింది అదితిరావ్ హైదరి. స్వల్ప విరామం అనంతరం `వి`లో నటించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. సహజంగానే రొటీన్ హీరోయిన్ రోల్స్ కు కాస్తంత దూరంగా ఉండే అదితి.. `వి`లో కూడా ఓ విలక్షణ పాత్ర చేసిందని టాక్.

‘భీష్మ’తో ‘మహానటి’?
`భీష్మ` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువ కథానాయకుడు నితిన్ నుంచి రాబోతున్న చిత్రం `రంగ్ దే`. ఇందులో నితిన్‌కు జోడీగా ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుదలయ్యేలోపే.. నితిన్ సరసన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నాయికగా నటించే ఛాన్స్ దక్కించుకుందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.
ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం
కరోనా మహమ్మారి తో ప్రపంచం తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై 130 కోట్ల భారతీయులు తమ సమైక్యతా భావాన్ని తెలిపేలా ఆదివారం రాత్రి 9గంటలనుండి 9 నిమిషాలవరకు దీప ప్రజ్వలన చేయాలనే ప్రధాని మోదీ పిలుపుకు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దీపాలు వెలిగించి సమైక్యతా భావాన్ని చాటారు.
`బాహుబలి - ది కంక్లూజన్` విడుదల తేదికి అల్లు అర్జున్ చిత్రం?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడమే కాకుండా, కెరీర్ బెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే వసూళ్ళ పరంగా `నాన్ - బాహుబలి` రికార్డు అందుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `బాహుబలి - ది కంక్లూజన్` రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసుకున్నాడట.
`ఆచార్య’ విడుదల తేదీకి ‘వకీల్ సాబ్’?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీనాట సంచలన విజయం సాధించిన కోర్టు డ్రామా `పింక్`కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎమోషనల్ డ్రామాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
పెళ్ళి వార్త పై కీర్తి సురేష్ స్పందన
రాజకీయ మూలాలున్న ఒక సంపన్న వ్యాపారవేత్త తో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే. పలు భాషలలో అగ్ర తారగా రాణిస్తున్న నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ తన పెళ్ళి పై వచ్చిన వార్తల పై తన స్పందన తెలియజేశారు.

విజయ్ ను చాలా మిస్ అవుతున్నా..!
హీరో విజయ్ దేవరకొండను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది ఓ యంగ్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. అయితే కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు. ఇక గత 20 రోజులకు పైగా ఇంట్లోనే ఉండటంతో ఈ అమ్మడు విజయ్ ను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది. మొత్తానికి మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరోయిన్ ను…
నా ఫేవరెట్ హీరోయిన్ తనే..!
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. దానితో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సాయి పల్లవి సంగతి గురించి తెలిసిందే కదా. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోదని.. పాత్ర ప్రధానమైన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ఒక్క సినిమాతో ఈ అమ్మడు యూత్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక మరోహీరో కూడా తన ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి అని చెబుతున్నాడు. ఆ హీరో ఏవరో కాదు…
మరోసారి క్రేజీ కాంబోలో మూవీ..!
మహేష్ - త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులు ఎదురుచూసే క్రేజీ కాంబినేషన్స్ లో వీరి కాంబినేషన్ కూడా ఉంటుంది. గురూజీ పంచ్ డైలాగ్స్.. మహేష్ నోటి నుండి వస్తే ఆ డైలాగ్స్ ఎలా పేలతాయో చెప్పనక్కర్లేదు. అతడు.. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో చూశాం. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. దానికి వేరే కారణాలు కూడా చెపుతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని విభేదాల వలన ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రీ యూనియన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.