ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడమే కాకుండా, కెరీర్ బెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అలాగే వసూళ్ళ పరంగా `నాన్ – బాహుబలి` రికార్డు అందుకున్నాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `బాహుబలి – ది కంక్లూజన్` రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసుకున్నాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. బన్నీ ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో 20వ చిత్రంగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బన్నీ డ్యూయల్ రోల్లో దర్శనమివ్వనున్నాడని టాక్. అంతేకాదు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన `బాహుబలి – ది కంక్లూజన్`(2017) చిత్రం విడుదలైన ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యాడని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బన్నీ, సుక్కు కాంబో మూవీలో రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా.. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు, టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: