చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం

Stylish Star Allu Arjun Also Takes Part In Narendra Modi Initiative

ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. కరోనా కట్టడి కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలతో ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు సాయం అందించి కృషి చేయవల్సిన అవసరం ఉంది.

భారతీయుల సమైక్యతకై 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు కు ప్రజలు స్పందించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించి తన కుటుంబ సభ్యులతో దీపాలు వెలిగించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here