కరోనా వైరస్ రోజు రోజు కు వ్యాపిస్తున్న వేళ పేద వాళ్లకు అండగా ఎంతోమంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ నుండి సామాన్య ప్రజల దాకా అందరూ పేద ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇక హీరోయిన్ లు కూడా ఒక్కొక్కళ్లు ముందుకొస్తున్నారు. కోట్లకి కోట్లు విరాళాలు ఇవ్వకపోయినా వారికి తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే నయన తార 20 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రణీత ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని… తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు తన వంతుగా సాయం చేస్తున్నాని తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రకుల్ కూడా తన పెద్ద మనసు చాటుకుంది. తన ఇంటికి సమీపంలో తిండిలేక సతమతమవుతున్న వారికి సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కుటుంబాలకు రెండు పూటలా భోజనాన్ని అందిస్తుంది. ఇంటికి దగ్గరలో ఆహారం వండించి, వారికి పంపిచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమకి తోచినంత సాయం చేయాలి. మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంది. దీనిని అదృష్టంగా భావించాలి. ఎవరి భోజనం వారు తింటున్నప్పుడు వారి ముఖంలో చిరు నవ్వు నాకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే నేను ఈ రకంగా సాయం చేస్తున్నాను… లాక్ డౌన్ ముగిసేంతవరకూ ఈ పేదలకు సాయం చేస్తానని చెప్పింది. మరి అన్ని కుటుంబాలకు…. లాక్ డౌన్ పూర్తయ్యేవరకూ అంటే మాములు విషయం కాదు. ఇక రకుల్ చేస్తున్న ఈ పనికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: