మహేష్ – త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అభిమానులు ఎదురుచూసే క్రేజీ కాంబినేషన్స్ లో వీరి కాంబినేషన్ కూడా ఉంటుంది. గురూజీ పంచ్ డైలాగ్స్.. మహేష్ నోటి నుండి వస్తే ఆ డైలాగ్స్ ఎలా పేలతాయో చెప్పనక్కర్లేదు. అతడు.. ఆ తర్వాత వచ్చిన ఖలేజా సినిమాలో చూశాం. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. దానికి వేరే కారణాలు కూడా చెపుతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని విభేదాల వలన ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రీ యూనియన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే గీత గోవిందం దర్శకుడు మహేష్ పరశురామ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళాలి కానీ కరోనా వల్ల షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేయబడడంతో సినిమాని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభించాలని మహేష్ భావిస్తున్నారట. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట.
ఇక ఇటీవల మహేష్ కు త్రివిక్రమ్ ఒక స్టోరీ లైన్ ని వినిపించారట. ఇక స్టోరీ లైన్ నచ్చడంతో మహేష్, దానిని పూర్తి స్క్రిప్ట్ గా సిద్ధం చేయమని, పరశురామ్ సినిమా అనంతరం దానిని మొదలెడదాం అని చెప్పినట్లు టాక్. మరి ఈ వార్త కనుక నిజమైతే. ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పవచ్చు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: