ప్రధాని పిలుపుకు చిరంజీవి సంఘీభావం

Megastar Chiranjeevi Supports Prime Minister Narendra Modi Initiative

కరోనా మహమ్మారి తో ప్రపంచం తల్లడిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువనే చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి తీసుకున్న నిర్ణయాలే దానికి కారణం. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకై 130 కోట్ల భారతీయులు తమ సమైక్యతా భావాన్ని తెలిపేలా ఆదివారం రాత్రి 9గంటలనుండి 9 నిమిషాలవరకు దీప ప్రజ్వలన చేయాలనే ప్రధాని మోదీ పిలుపుకు సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా దీపాలు వెలిగించి సమైక్యతా భావాన్ని చాటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో పాటు దీపాలు వెలిగించి తన సంఘీభావాన్ని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ రద్దు కావడంతో రోజు వారీ జీతాలతో బ్రతికే పేద కళారులు, కార్మికుల సంక్షేమానికై తోటి నటుల విరాళాలతో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఒక సంస్థ ను నెలకొల్పి పేద కళారులు, కార్మికులకు సహాయ పడుతున్నారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి ప్రతీ విషయాన్నిఅభిమానులతో పంచుకుంటున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.