`ఆచార్య’ విడుదల తేదీకి ‘వకీల్ సాబ్’?

Power Star Pawan Kalyan Come Back Movie Vakeel Saab To Hit Theaters On August 14th

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీనాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన కోర్టు డ్రామా `పింక్‌`కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. `దిల్‌` రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఎమోష‌న‌ల్ డ్రామాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. క‌రోనా కార‌ణంగా ‘వ‌కీల్ సాబ్‌’ నిర్మాణంలో జాప్యం జ‌ర‌గ‌డంతో తొలుత అనుకున్నట్టు మే 15న‌ కాకుండా.. ఆగ‌స్టు 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి ఇదే తేదీకి మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుద‌ల కావ‌ల‌సి ఉండగా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇప్పుడా చిత్రం వ‌చ్చే ఏడాది వేస‌వికి వాయిదా పడిందని టాక్. ఈ నేప‌థ్యంలోనే.. `వ‌కీల్ సాబ్` ఆగ‌మ‌నం ఆగ‌స్టు 14కి ఫిక్స్ అయింద‌ట‌.

త్వ‌ర‌లోనే ‘వ‌కీల్ సాబ్‌’ విడుద‌ల తేదికి సంబంధించి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =