‘అల వైకుంఠపురములో’ భారీ రేటుకు హిందీ హక్కులు

Allu Arjun Recent Blockbuster Alavaikunthapurramulo Hindi Rights Sold For A whopping Price
Allu Arjun Recent Blockbuster Alavaikunthapurramulo Hindi Rights Sold For A whopping Price

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అంతేకాదు బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 160 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాసింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్, థమన్ సాంగ్స్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఈ మధ్య ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్మిన సంగతి మనందరికి తెలిసిన సంగతే.

ఇప్పుడు ఈ సినిమా హిందీ హక్కులు కూడా భారీ రేటు కు పలుకుతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ హిందీ రీమేక్ హక్కులను ఓ హిందీ నిర్మాత భారీ ధర చెల్లించి దక్కించుకున్నారట. ఆయనెవరో కాదు ప్రొడ్యూసర్ అశ్విన్ వర్దే. దాదాపు 13 కోట్ల వరకు ఈ రైట్స్ పలికాయని ప్రచారం జరుగుతుంది. అంతే కాదు ఇక ఈ సినిమాని బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా అశ్విన్ గత ఏడాది షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తెరకెక్కించగా భారీ విజయం అందుకుంది. మరి ఈ సినిమా తో మళ్ళీ హిట్ కొడతాడేమో..? అల వైకుంఠపురములో అక్కడ ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో..? చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here