దీపకాంతి లో హీరోయిన్ పూజాహెగ్డే

Actress Pooja Hegde Light Up Candles In Support Of Prime Minister Narendra Modi Initiative

కరోనా వైరస్ పై పోరాటానికి ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9నిమిషాలపాటు దీప ప్రజ్వలనకై పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. భారతీయుల సమైక్యతా ప్రదర్శనకు ప్రతీకగా దేశవ్యాప్తంగా జరిగిన దీప ప్రజ్వలన జయప్రదం గా ముగిసింది. ఈ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ప్రధాని మోదీ పిలుపుకు మద్దతు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ రద్దు కావడంతో పూజ ఇంటికే పరిమితం అయ్యారు. తన ఇంట్లో పూజ దీపాలు వెలిగించారు. పూజా హెగ్డే పలు మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో అఖిల్ , పూజాహెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా #Prabhas 20 మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు జంటగా ఒక మూవీ కి పూజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతో కూడా నటిస్తూ పూజ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.