నా ఫేవరెట్ హీరోయిన్ తనే..!

Sai Pallavi Is My Favourite Heroine Says Mega Powerstar Ramcharan
Sai Pallavi Is My Favourite Heroine Says Mega Powerstar Ramcharan

మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. దానితో ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సాయి పల్లవి సంగతి గురించి తెలిసిందే కదా. ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు ఒప్పుకోదని.. పాత్ర ప్రధానమైన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.
ఇక ఒక్క సినిమాతో ఈ అమ్మడు యూత్ లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక మరోహీరో కూడా తన ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి అని చెబుతున్నాడు. ఆ హీరో ఏవరో కాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇటీవల చరణ్ ను తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడగగా… దానికి చరణ్ ఏ మాత్రం తడబడకుండా సాయి పల్లవి అని చెప్పాడు. మరి రామ్ చరణ్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో చేశాడు. ఒక్క కాజల్ తోనే మూడు నాలుగు సినిమాలు చేసాడు. అలాంటిది సాయి పల్లవి పేరు చెప్పాడంటే గొప్ప విషయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి వీరిద్దరి కాంబినేషన్స్ లో సినిమా వస్తే చూడటానికి చాలా బావుంటుంది. మరి చూద్దాం తన ఫేవరెట్ హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రామ్ చరణ్ కు వస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 17 =