కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 146

సినిమా వార్తలు

నాకోసం ఇది చేయండి చాలు..!

కరోనా వైరస్‌ తో లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు.. జాగ్రత్తలు చెపుతున్నారు. ఇప్పటివరకూ పలువురు పలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా తాజాగా అఖిల్ సోషల్ మీడియా లో ఒక వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. రేపు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఇలాంటి సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్…

TFN Adminవాట్సాప్
Thala Ajith Contributes 1.25 Crore To Corona Virus Fund
సినిమా వార్తలు

భారీ విరాళం ప్రకటించిన 'అజిత్'

కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టే చర్యల నిమిత్తం తమ వంతు సాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో తమిళ్ స్టార్ హీరోయిన్ అజిత్ కూడా చేరిపోయారు. రూ. కోటి 25 లక్షల రూపాయిలను విరాళంగా ప్ర‌క‌టించారు. ప్రధాన మంత్రి స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లును, తమిళనాడు ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 50 ల‌క్ష‌లను, అలాగే సినీ వర్కర్స్ యూనియన్ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ కోసం మరో రూ. 25 ల‌క్ష‌లను అజిత్ విరళంగా అందిస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Ajay Devgn Is The Well Deserved Actor For That Role Says SS Rajamouli
సినిమా వార్తలు

'10' మందిలో '9' మంది అతని పేరే చెప్పారు..!

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా... కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో అజయ్ దేవగన్ కూడా ఒకరు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ను ఎలా ఎంపిక చేసుకున్నారో చెప్పారు రాజమౌళి.

TFN Adminవాట్సాప్
Star Heroine Ileana Turns Sports Anchor
సినిమా వార్తలు

స్పోర్ట్స్ యాంకర్ గా ఇలియానా ?

బ్లాక్ బస్టర్ "దేవదాసు" మూవీ తో గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన పోకిరి, రాఖీ, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ మూవీ "బర్ఫీ" హిందీ మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా ,హిందీ మూవీస్ తో బిజీ అయ్యి తెలుగు మూవీస్ లో నటించలేదు. 6 సంవత్సరాల తరువాత రవితేజ హీరోగా రూపొందిన "అమర్ అక్బర్ ఆంటోని " మూవీ తో టాలీవుడ్ కు ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అవసరమైతే 'అమ్మ' చున్నీ వాడండి...!

అవసరమైతే అమ్మ చున్నీ వాడండి అని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా తమ సూచనలను ఇస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు జాగ్రత్తలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సూచనలు చెబుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Don't Trust Fake News About Corona Virus Says Super Star Mahesh Babu
సినిమా వార్తలు

ఫేక్ న్యూస్ పట్టించుకోవద్దు - మహేష్ బాబు

కరోనా మహమ్మారి కారణం గా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఈ రోజు "వరల్డ్ హెల్త్ డే " సందర్భంగా మహేష్ బాబు తన ట్వీట్స్ ద్వారా ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. 2వారాల లాక్ డౌన్ కారణం గా మనం స్ట్రాంగ్ గా తయారయ్యామని, కరోనా వైరస్ నివారణకై మన ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిద్దాం అని, COVID-19 నివారణకు ముందుండి పోరాటం చేస్తున్న వారికి "వరల్డ్ హెల్త్ డే " సందర్భంగా థ్యాంక్స్ చెబుదామని, మన హెల్త్ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడి వీధులలో, హాస్పటల్స్ లో పోరాడే ధైర్యస్థులకు ప్రశంసలు తెలపాలని ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
Actor Nikhil Siddharth Postpones His Wedding Due To Lockdown
సినిమా వార్తలు

పెళ్లి వాయిదా తప్పట్లేదు..!

ఏది ఏమైనా పెళ్లి ఆపే ప్రసక్తే లేదు.. అవసరమైతే గుడిలో పెళ్లి చేసుకుంటా అని యంగ్ హీరో నిఖిల్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కరోనా వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆపేసి అందరూ ఇంటికే పరిమితమైన తరుణంలో నిఖిల్ కూడా తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు. లాక్ డౌన్ కారణంగా తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు నిఖిల్ ప్రకటించారు. “ప్రస్తుత పరిస్థితుల్లో మేము వివాహం చేసుకోవడం సాధ్యమవుతుందని నేను అనుకోను. అందుకే మా వివాహాన్ని వాయిదా వేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు” అని నిఖిల్ తెలిపాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mohanlal To Play A Pivotal Role In RRR
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - ఎన్టీఆర్ కి బాబాయ్ గా సూపర్ స్టార్..?

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం 'రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇటీవలే ఉగాది సందర్బంగా ఈ సినిమా టైటిల్ ''రౌద్రం రుధిరం రణం'' మోషన్ పోస్టర్ ను... రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక చెర్రీ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెర్రీ యాక్షన్ కు, ఎన్టీఆర్ వాయిస్ తోడై టోటల్ గా గూస్ బంప్స్ తెప్పించింది టీజర్. ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేశం కోసం కాజల్ సందేశం

కరోనా వైరస్ కారణం గా ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ప్రాణాంతక వ్యాధి కరోనా మహమ్మారి నివారణ కై ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. కరోనా కారణం గా అన్ని పరిశ్రమలు నష్టాలకు గురి అవుతున్నాయి. దేశం ఆర్ధికంగా కోలుకోవాలంటే ఏం చేయాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Director Sukumar Bunny New Movie Titled Pushpa
సినిమా వార్తలు

బన్నీ - సుకుమార్ సినిమా టైటిల్ గా 'పుష్ప'...?

బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. మరి స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి కదా. అలానే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఈ సినిమాకు 'శేషాచలం' అన్న టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే ఆ రూమర్లను అప్పుడే కొట్టిపడేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

“ ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉంది ” అన్నారు సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఆయన కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ " కరోనా సృష్టించిన విపత్కర పరిస్థితులను అధిగమించటానికి డాక్టర్లు, నర్సులు , పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ఇంకా అనేక శాఖల వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి త్యాగం, కష్టం వెలకట్టలేనివి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ ద్విపాత్రాభినయం

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో శృతిహాసన్ కథానాయిక. హీరో రవితేజ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
NTR Timeless Classic Shavukaru Completes 70 Years
సినిమా వార్తలు

యన్టీఆర్ ‘షావుకారు’కు 70 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గ‌జ ద‌ర్శ‌కులు య‌ల్.వి.ప్ర‌సాద్ మ‌ధ్య మంచి అనుబంధమే ఉంది. య‌న్టీఆర్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాదు.. య‌న్టీఆర్‌తో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలనూ తెర‌కెక్కించారు ద‌ర్శ‌కులు య‌ల్.వి.ప్ర‌సాద్. అలా య‌న్టీఆర్ తొలి చిత్రం ‘మ‌న‌దేశం’(1949)తో మొద‌లైన వీరి ప్ర‌యాణం.. ‘అప్పు చేసి పప్పుకూడు’(1959) వరకు సాగింది. అటువంటి వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన అపురూప‌ చిత్రాల్లో ‘షావుకారు’ ఒకటి.

Team TFNవాట్సాప్
Akkineni Nagarjuna Musical Blockbuster Nenunnanu Completes 16 Years
సినిమా వార్తలు

నాగార్జున మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'నేనున్నాను' కి ప‌ద‌హారేళ్ళు

కింగ్ నాగార్జున‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి క‌ల‌యిక‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ వ‌చ్చాయి. వాటిలో ‘నేనున్నాను’ ఒక‌టి. నాగార్జున, శ్రియ‌, ఆర్తి అగ‌ర్వాల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌కి వి.ఎన్.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ముకేష్ రుషి, సుబ్బ‌రాజు, ప‌శుప‌తి, బ్ర‌హ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ళ భ‌ర‌ణి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణం, సుధ, శివ‌పార్వ‌తి, ర‌విబాబు ముఖ్య‌ పాత్ర‌లు పోషించగా.. అనిత (‘నువ్వు నేను’ ఫేమ్‌) ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది.

Team TFNవాట్సాప్
Allu Arjun Gearing Up For A Special Gift To His Fans On His Birthday
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్

బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా #AA 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లక్కీ హీరోయిన్ రష్మిక కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో #AA 20 మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan and Ravi Teja Join Hands For A Multistarrer Movie
సినిమా వార్తలు

ప‌వ‌న్, ర‌వితేజ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టారర్ మూవీ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు ‘వ‌కీల్ సాబ్‌’లో లాయ‌ర్ గా న‌టిస్తూనే.. మ‌రోవైపు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామాలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారాయ‌న‌. ఈ రెండు చిత్రాల‌తో పాటు.. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లోనూ నటించేందుకు సిధ్ధప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప‌వ‌న్ ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్.

Team TFNవాట్సాప్
Director Sukumar and Energetic Star Ram Teams Up Again After Jagadam
సినిమా వార్తలు

మ‌రోసారి రామ్, సుకుమార్ కాంబినేష‌న్?

`ఇస్మార్ట్ శంక‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. త‌మిళ సినిమా `త‌డ‌మ్` ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` అనంత‌రం రామ్, కిషోర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. కాగా ఈ చిత్రం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని చేసేందుకు రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కూడా రామ్ ఖాతాలో చేర‌నుంద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు 'సశేషం' వెనుక ఉన్న మర్మం ఏంటో...!

మొత్తానికి మెగా స్టార్ చిరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నా టైప్ లో అలా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారో లేదో.. అందరికంటే చాలా యాక్టీవ్ గా వుంటున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులుగా చేసిన ట్వీట్స్ ఏమో కానీ చిరు లేటెస్ట్ గా చేసిన ట్వీట్ మాత్రం కాస్త సందేహంలో పడేసింది. తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరు. అదేంటంటే... ఏప్రిల్ 8వ తేదీ.. ఈ తారీకుతో నాకు చాలా అనుబంధం ఉందని చెబుతూ..(సశేషం).. అంటూ తన పోస్ట్ లో తెలిపారు. ఏప్రిల్ 8 తో వున్న సంబంధం గురించి ఏ విషయాన్ని తెలియజేయకుండా డైలమాలో పడేయడంతో.. .ఈ పోస్ట్ పై చిరంజీవి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సీక్వెల్ కే ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి?

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘సరిలేరు నీకెవ్వ‌రు’తో మ‌రో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. కాగా ‘స‌రిలేరు...’ త‌రువాత ఇప్ప‌టివ‌ర‌కు త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప్ర‌క‌టించ‌ని అనిల్.. త‌న ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమ్మారెడ్డి భరద్వాజ్ కి మాతృ వియోగం

ఇంతకు ముందే రాజీవ్ కనకాల సోదరి లక్ష్మీ కనకాల మృతి చెందిన వార్త విన్నాం. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వా జ్ కు మాతృ వియోగం కలిగింది. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ మాతృమూర్తి కృష్ణ‌వేణి గారు గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండటంతో... నేడు తుది శ్వాస విడిచారు.

TFN Adminవాట్సాప్

షేర్