నటుడు రాజీవ్ కనకాల ఇంటిలో విషాదం చోటు చేసుకుంది. గత ఏడాది వీరి తండ్రిగారైన దర్శకుడు మరియు సీనియర్ నటులు దేవదాస్ కనకాల అనారోగ్యంతో మరణించిన సంగతి విదితమే. ఆ బాధ నుండి ఇంకా కోలుకోకముందే మరో విషాదం నెలకొంది. సోదరి శ్రీలక్ష్మీ అకాల మరణం పొందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలక్ష్మీ కనకాల నేడు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న చిత్ర ప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీలక్మి ప్రముఖ నటుడు, దర్శకుడు దేవదాసు కనకాల ఏకైక కుమార్తె. సోదరుడు రాజీవ్ కనకాల. భర్త సీనియర్ జర్నలిస్ట్ పెద్ది రామారావు. వీరికి 2002లో వివాహం కాగా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.
ఇక సుమతో కూడా మంచి అనుబంధం ఉంది. సుమకు, రాజీవ్ కనకాలతో పెళ్లి కాక ముందే… శ్రీలక్ష్మీకి ఆమె మంచి స్నేహితురాలు. ఇద్దరూ కలిసి సీరియల్స్‌లో కూడా నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: