విజయ్ ను చాలా మిస్ అవుతున్నా..!

Actress Ananya Pandey Missing Her Movie Co Star Vijay devarakonda Due To Lockdown

హీరో విజయ్ దేవరకొండను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది ఓ యంగ్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. అయితే కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు. ఇక గత 20 రోజులకు పైగా ఇంట్లోనే ఉండటంతో ఈ అమ్మడు విజయ్ ను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది. మొత్తానికి మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరోయిన్ ను బాగానే ఇంప్రెస్ చేసినట్టున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో… పూరీ విజయ్ ను ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =