అల్లు అర్జున్ ‘బ‌న్ని’కి 15 ఏళ్ళు

Allu Arjun Musical Hit Bunny Completes 15 Years

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలున్నాయి. వాటిలో ‘బ‌న్ని’ ఒక‌టి. `గంగోత్రి`, `ఆర్య‌` వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌రువాత వ‌చ్చిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్… బ‌న్నీకి హ్యాట్రిక్ హిట్ ని అందించింది. వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా గౌరీ ముంజ‌ల్ న‌టించగా.. ప్ర‌కాష్ రాజ్, శ‌ర‌త్ కుమార్, ముకేష్ రుషి, శ‌ర‌త్ స‌క్సేనా, ర‌ఘుబాబు, ‘ఆహుతి’ ప్ర‌సాద్, చ‌ల‌ప‌తిరావు, సీత‌, సుధ ముఖ్య భూమిక‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్ర‌బోస్, సుద్దాల అశోక్ తేజ‌, విశ్వ గీత ర‌చ‌న చేయ‌గా.. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందించాడు. “బ‌న్నీ బన్నీ”(టైటిల్ సాంగ్), “జాబిల‌మ్మ‌వో”, “మారోమారో”, “మ‌యిలు మయిలు” వంటి పాట‌లు కుర్ర‌కారును ఉర్రూత‌లూగించాయి. యం.సత్య‌నారాయ‌ణ రెడ్డి నిర్మించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను.. బెంగాలీలో ‘ఛాలెంజ్’ పేరుతో రీమేక్ చేశారు. 2005 ఏప్రిల్ 6న విడుద‌లైన ‘బ‌న్ని’.. నేటితో 15 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 13 =