‘వి’లో అదితిరావ్ హైద‌రీ విల‌నిజం?

Aditi Rao Hydari To Play Antagonist In Nani's V Movie

‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’ చిత్రాలతో తెలుగునాట‌ క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర‌వేసింది అదితిరావ్ హైదరి. స్వ‌ల్ప విరామం అనంత‌రం `వి`లో న‌టించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. స‌హ‌జంగానే రొటీన్ హీరోయిన్ రోల్స్ కు కాస్తంత దూరంగా ఉండే అదితి.. `వి`లో కూడా ఓ విల‌క్ష‌ణ పాత్ర చేసింద‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `వి`లో సుధీర్ బాబు హీరోగా న‌టించ‌గా.. నేచుర‌ల్ స్టార్ నాని విల‌న్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. నానికి జోడిగా న‌టించిన అదితి కూడా విల‌న్‌గానే క‌నిపించ‌నుంద‌ని టాక్. అలాగే, నాని – అదితి కాంబోలో వ‌చ్చే ప‌లు స‌న్నివేశాలు.. సినిమాకే ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని తెలిసింది. మ‌రి.. ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే `వి` విడుద‌ల తేదీ వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

‘దిల్’ రాజు నిర్మించిన `వి` మార్చి 25నే విడుద‌ల కావాల్సి ఉండ‌గా… కరోనా ఎఫెక్ట్ తో వాయిదా ప‌డింది. త్వ‌ర‌లోనే కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.