“ఇండియన్ 2(భారతీయుడు 2)” మూవీ లేనట్టేనా ?

Indian 2 Movie Makers Not Keen On Going Forward With Movie Shooting

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ తో ఇండియన్ 2(భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సూపర్ హిట్ “భారతీయుడు ” మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ నిలిచిపోతున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఇండియన్ 2” మూవీ షూటింగ్ ప్రారంభం నుండీ ఏదో ఒక అవాంతరం కలుగుతూనే ఉంది. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల తరువాత అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది. తరువాత కమల్ హాసన్ కాలుకి ఆపరేషన్ జరగటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఫిబ్రవరి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న సమయం లో క్రేన్ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం సంభవించింది. తిరిగి షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తే కరోనా వైరస్ కారణంగా షూటింగ్ రద్దు అయ్యింది. ప్రతీ సారీ ఏదో ఒక కారణం గా షూటింగ్ కు అవాంతరం కలుగుతుండటంతో చిత్ర నిర్మాణాన్ని నిలిపివేయాలని నిర్మాత ఆలోచిస్తున్నట్టుసమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 4 =