బ్లాక్ బస్టర్ “దేవదాసు” మూవీ తో గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన పోకిరి, రాఖీ, జల్సా, కిక్ , జులాయి మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ మూవీ “బర్ఫీ” హిందీ మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా ,హిందీ మూవీస్ తో బిజీ అయ్యి తెలుగు మూవీస్ లో నటించలేదు. 6 సంవత్సరాల తరువాత రవితేజ హీరోగా రూపొందిన “అమర్ అక్బర్ ఆంటోని ” మూవీ తో టాలీవుడ్ కు ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా ఇప్పుడు ఒక కొత్త కెరీర్ ను ఎంపిక చేసుకుంటున్నారని సమాచారం. యాంకర్ గా మారేందుకు ఇలియానా ఒక స్పోర్ట్స్ ఛానల్ ను సంప్రదించినట్టు, స్పోర్ట్స్ ఛానల్ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సో , త్వరలో ఇలియానా స్పోర్ట్స్ ఛానల్ యాంకర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఇలియానా ప్రస్తుతం ఒక తెలుగు, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: