నాకోసం ఇది చేయండి చాలు..!

కరోనా వైరస్‌ తో లాక్ డౌన్ చేయడం వల్ల కొంత మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్లందరినీ కాపాడటానికి ప్రభుత్వంతో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ముందుకొస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు. ప్రజలకు పలు సూచనలు.. జాగ్రత్తలు చెపుతున్నారు. ఇప్పటివరకూ పలువురు పలు వీడియోలు సోషల్  మీడియా వేదికగా పంచుకోగా తాజాగా అఖిల్ సోషల్ మీడియా లో ఒక వీడియో ను అభిమానులతో పంచుకున్నాడు. రేపు అఖిల్ పుట్టినరోజు కావడంతో.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎవరు తన పుట్టినరోజు వేడుకలు చేయవద్దని రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. ఇలాంటి సమయంలో బర్త్ డే సెలబ్రేషన్స్ కరెక్ట్ కాదన్నాడు. అభిమానులందరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరా డు. అలాగే తన సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో  అందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటో ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అలాగే నా కోసం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోను పోస్ట్  చేయండని అభిమానులతో పాటు ప్రేక్షకులను కోరారు.

కాగా  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here