అవసరమైతే ‘అమ్మ’ చున్నీ వాడండి…!

Vijay Devarakonda Shares Message To Public About Staying Safe From Corona Virus
Vijay Devarakonda Shares Message To Public About Staying Safe From Corona Virus

అవసరమైతే అమ్మ చున్నీ వాడండి అని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టించేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉండి కరోనాను నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా తమ సూచనలను ఇస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతోమంది పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు జాగ్రత్తలు చెప్పగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా తన సూచనలు చెబుతున్నాడు.

”మీరందరూ సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వైరస్ నుండి కాపాడుకోవడానికి క్లాత్ తో పేస్ కవర్ చేసుకున్నా చాలు .. వైరస్ తొందరగా వ్యాప్తి చెందదు. మెడికల్ మాస్క్‌లను వైద్యుల కోసం వదిలేద్దాం… వాటికి బదులుగా.. రుమాలు, టవల్ ఉపయోగించండి. లేకపోతే అమ్మ చున్నీనైనా వాడండి. ఏదొక దానితో మీ ముఖాన్ని కప్పుకోండి, సురక్షితంగా ఉండండి’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here