బన్నీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. మరి స్టార్ హీరో.. స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందంటే.. ఇక ఆ సినిమాకు సంబంధించిన పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉంటాయి కదా. అలానే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. గతంలో ఈ సినిమాకు ‘శేషాచలం’ అన్న టైటిల్ అనుకుంటున్నట్టు రూమర్లు వచ్చాయి. అయితే ఆ రూమర్లను అప్పుడే కొట్టిపడేసింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా మరోసారి ఈ టైటిల్ పై గత వారం రోజుల నుండి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బన్నీ-సుక్కు కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా అదే మాదిరిగా ఈ సినిమాకు కూడా కేవలం రెండు అక్షరాల టైటిల్ ఉన్నట్టు టాక్స్ వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆ టైటిల్ ఏంటో కూడా వార్తలు నడుస్తున్నాయి. ఈ సినిమాకు ‘పుష్ప’ అనే టైటిల్ ను పెట్టినట్టు తెలుస్తుంది. ‘పుష్ప’ అనేది ఈ సినిమాలోని హీరోయిన్ పేరు. ఈ టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే టైటిల్ రిలీజ్ చేసేంత వరకూ ఆగాల్సిందే.
కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తుంది. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి అల్లు అర్జున్ రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అల వైకుంఠపురములో’ లో నటించి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. మరి ఆర్య సిరీస్ తర్వాత సుకుమార్ తో బన్నీ చేస్తున్న సినిమా ఇది. చూద్దాం ఈసినిమాతో కూడా హ్యాట్రిక్ కొడతాడేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: